telugu navyamedia
క్రీడలు వార్తలు

చహల్ : ఐపీఎల్ వదిలి పెడుదాం అనుకున్న.. కానీ…?

ఐపీఎల్ 2021 లోని జట్లలో కరోనా కేసులు నమోదవడంతో బీసీసీఐ టోర్నీని నిరవధిక వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2021 వాయిదాకు ముందే కొందరు ఆటగాళ్లు లీగ్ నుంచి వెళ్లిపోయారు. యుజ్వేంద్ర చహల్ మాట్లాడుతూ… ‘నా తల్లిదండ్రులకు కరోనా వైరస్ సోకిందని తెలియగానే.. ఐపీఎల్​ నుంచి విరామం తీసుకోవాలని అనుకున్నా. ఇంటి దగ్గర వాళ్లు ఒంటరిగా ఉన్న సమయంలో ఇలా జరిగితే.. ఆటపై దృష్టి సారించడం చాలా కష్టమవుతుంది. మే 3న నా తల్లిదండ్రులకు పాజిటివ్ అని నిర్ధరణ అయింది. కాస్త ఆందోళనకు గురయ్యా. ఆ సమయంలో ఏం చేయాలో అర్ధం కాలేదు. ఆ మరుసటి రోజే ఐపీఎల్ 2021​ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది’ అని అన్నాడు. ‘నా తండ్రి ఆక్సిజన్ లెవెల్స్ 85-86కి పడిపోయాయి. దీంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించాం. నిన్ననే అక్కడి నుంచి తీసుకొచ్చాం. అయినప్పటికీ అతనికి వైరస్​ ఉన్నట్లు తేలింది. ఏదేమైనా నాన్న ఆక్సిజన్ లెవెల్స్​ 95-96కి చేరుకోవడం నాకు సంతోషంగా ఉంది. ఇది మా కుటుంబంలో కొంత ఉపశమనం ఇచ్చింది. నాన్న మెరుగవ్వడానికి ఇంకో 7-10 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. నాన్న త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని వేడుకుంటున్నా’ అని యుజ్వేంద్ర చహల్ పేర్కొన్నాడు.

Related posts