telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైఎస్‌ వివేకా హత్య కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ

ap high court

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసుపై ఈ రోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. కేసును సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్లపై ధర్మాసనం సుధీర్ఘంగా విచారించింది. వివేకా హత్య కేసును సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్లపై ఈ నెల 20కి వాయిదా పడింది. అడ్వకేట్ జనరల్‌ లేకపోవడంతో హైకోర్టు విచారణ వాయిదా వేసింది. హత్య జరిగి ఏడాది అవుతున్నా ఎలాంటి ఆధారాలను గుర్తించలేదని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోర్టుకు వినిపించారు.

హత్య చేసి, రక్తపు మరకలు తుడిచివేయడం జరిగినా అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు డ్రైవర్‌ను అరెస్ట్ చేయలేదు. జగన్‌ ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు సీబీఐ విచారణ అన్నారు. సీఎం అయ్యాక పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారని పిటిషనర్‌ తన వాదనను కోర్టుకు వినిపించారు.ఇతరుల పిటిషన్‌ విషయాలు ప్రస్తావించవద్దని పిటిషనర్‌కు న్యాయమూర్తి సూచించారు.

Related posts