వైఎస్ పాలన జగన్‌తోనే సాధ్యమని వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. ఈరోజు ఉదయం కడప జిల్లా ఇడుపులపాయలోని దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద విజయమ్మ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ వైఎస్ పాలనతో పోల్చినప్పుడు ప్రస్తుత పాలన చూస్తే చాలా బాధ కలుగుతుందన్నారు. జగన్‌కు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైఎస్ జగన్ కుటుంబం కంటే ప్రజలతోనే ఎక్కువ మమేకమై ఉన్నారన్నారు.
పాదయాత్రలో జగన్ ప్రజల కష్టాలు చూశాడు. ప్రతి ఒక్కరికి నేనున్నానే భరోసా కల్పించాడని చెప్పారు. చేసిన అభివృద్ధిని చెప్పుకోలేని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో జగన్ జపం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నుంచి జగన్‌కు తోడుగా ఆయన తల్లి, వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిల కూడా ప్రచారంలో పాల్గొననున్నారు. విజయమ్మ ప్రకాశం జిల్లా కందుకూరు, కనిగిరి, మార్కాపురంలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
చంద్రబాబుకు ఓటు ద్వారా రాజకీయ శిక్ష: మందకృష్ణ