telugu navyamedia
తెలంగాణ వార్తలు

అన్నం పెట్టే రైతన్న నోట్ల సున్నం కొడుతున్నారు..

తెలంగాణ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు శనివారం వైఎస్ షర్మిల ఇందిరా పార్క్ వద్ద దీక్ష ప్రారంభించారు. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు ఇందిరా పార్క్‌ వద్ద 72 గంటలపాటు రైతు వేదన నిరాహార దీక్షను ఆమె చెప‌ట్టారు. అనంతరం లోటస్ పాండ్‌లోని వైఎస్సార్‌టీపీ పార్టీ కార్యాలయంలో మిగిలిన దీక్షను పూర్తి చేయనున్నారు.

వరి ధాన్యం కొనుగోలు చేయనని చెప్పిన కేంద్రంపై దిల్లీలో పోరాడాల్సిందిపోయి.. రాష్ట్రంలో ధర్నాలు చేసి ఎవరిని ఉద్ధరిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల మండిపడ్డారు. పంటలు మార్చమని చెబుతున్నారని.. పంట మార్పిడి అంటే.. మంత్రులను మార్చినంత సులభమా అని ప్రశ్నించారు.

YS Sharmila deeksha: ఇందిరా పార్క్ వద్ద వైఎస్ షర్మిల దీక్ష ప్రారంభం | YSRTP  Chief ys sharmila started 72 hours raithu avedana deeksha

రాష్ట్రంలో ధర్నాలు చేసి ఎవరిని ఉద్ధరించారని ముఖ్యమంత్రి కేసీఆర్​ ను ష‌ర్శిళ‌ ప్రశ్నించారు. వరి ధాన్యం కొనుగోలు చేయడం చేతకాక.. ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు”వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ అన్నం పెట్టే రైతన్న నోట్ల సున్నం కొడుతున్నారు.

రాష్ట్ర రైతులు వరి పండించి ఆ వడ్లు అమ్మడానికి తిప్పలు పడుతున్నారు. ఎక్కడపడితే అక్కడ కుప్పలు పోస్తూ.. ఎండాచలికి తొణకకుండా ఆ కుప్పలపై కుప్పకూలుతున్నారు.

ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్‌ లేఖ రాస్తే తాము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామని రాష్ట్ర బీజేపీ సమాధానం ఇస్తున్నది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయాలతో రైతు నష్టపోతున్నాడని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది.

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తో షర్మిల పాదయాత్ర వాయిదా..

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టుగా ఆ పార్టీ ప్రకటించింది. 21 రోజుల్లో సాగిన యాత్రలో షర్మిల.. ఆరు నియోజకవర్గాల్లోని 150 గ్రామాలను సందర్శించినట్లు పేర్కొంది.

రాష్టంలో సమస్యలే లేవని పాలకులు చెబుతున్నారని, కానీ తన పాదయాత్రలో ప్రజలు ఎన్నో సమస్యలు తన దృష్టికి తీసుకొచ్చారని షర్మిల చెప్పారు. 

రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు రైతుల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని షర్మిల అన్నారు. ఉచిత విద్యుత్, ఇన్​పుట్ సబ్సిడీ, పంట బీమా, విత్తనాల సబ్సిడీలతో కర్షకులకు ఆర్థిక భారాన్ని తగ్గించారని తెలిపారు. యాసంగిలో వరి ధాన్యం కోనుగోలు చేయబోమని కేసీఆర్‌ ప్రకటించడం ఎంత వరకు సబబు అని ఆమె ప్రశ్నించారు.

Related posts