వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసు విచారణను వేగవంతం చేసింది .ఎన్ఐఏ ఆదేశాలతో విశాఖపట్నం ఏడో అదనపు మెట్రో పాలిటన్ సెషన్ జడ్జ్ కేసును విజయవాడ ఎన్ఐఏ కోర్టుకు బదిలీ చేశారు. జగన్ పై హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ అధికారులు నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుని విజయవాడ ఎంఎస్‌జే కోర్టులో శుక్రవారం హాజరు పరిచారు.
ఈ నెల 25 వరకు నిందితుడికి కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో నిందితుడిని తమ కస్టడీకి అప్పగించాలంటూ ఎన్ఐఏ పిటిషన్ దాఖలు చేసింది. నిందితుడి తరుపు న్యాయవాదులు ఎవరూ కస్టడీ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయక పోవడంతో పిటిషన్‌ని న్యాయస్థానం పెండింగ్‌లో పెట్టింది. వాచారణను ఈ నెల 25కి వాయిదావేసింది.
బాబు పాలనలో వ్యవస్ధలన్నీ నిర్వీర్యం: లక్ష్మీపార్వతి