telugu navyamedia
రాజకీయ

జ‌గ‌న్ బెయిల్‌పై ఉత్కంఠ‌..!

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుపై గతంలో అరెస్టైన విష‌యం తెలిసిందే. సుమారు 16 నెలల పాటు జైలులో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. అప్పటి నుండీ, ఇప్పటి దాకా ఈ కేసుపై విచార‌ణ జ‌రుగుతూనే ఉంది.

ఈ నేప‌థ్యంలోనే జగన్ బెయిల్ రద్దవుతుందా..? కొనసాగుతుందా..? ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ విచారణపై శుక్ర‌వారం రోజుకూ ఉత్కంఠ నెల‌కొతోంది. సుప్రీం కోర్టు దీనిపై ఏం చెబుతుందని అంతా ఆసక్తి ఎదురు చూస్తున్నారు. పిటిషనర్ వాధనతో ఏకిభవించి బెయిల్ రద్దు చేస్తే ఏపీలో పాల‌న పరిస్థితి ఏంటి. రాజకీయంగా ఎలాంటి పరిణామాలు ఉంటాయి. ఇలా ఎన్నో ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బెయిర్ రద్దు సాధ్యం కాదని కొందరు అంటున్నారు. మరి ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. అయితే పదే పదే విచారణ వాయిదా పడుతుండడంతో ఈ ఉత్కంఠ ఇంకాస్త పెరుగుతోంది.

తాజాగా జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. కేసుకు సంబంధించి సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. కోర్టు విచక్షణ అధికారాలకే నిర్ణయం వదిలేసామంటూ దాఖలు చేసిన మెమోను పరిగణలోకి తీసుకోవాలంటూ కోర్టును సీబీఐ కోరింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే జగన్ తరపు న్యాయవాదులు లిఖితపూర్వకమైన వాదనలు కోర్టుకు సమర్పించారు. వేర్వేరుగా ఎవరి వాదన వారు వినిపించారు.

అంత‌కుముందు విచారణ సమమంలో తప్పకుండా లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాల్సిందే అంటూ కోర్టు సీబీఐ అధికారులు గట్టిగానే చెప్పింది. దీంతో తాజాగా కోర్టు విచాక్షణాధికారానికే వదిలిస్తున్నామని సీబీఐ అధికారులు చెప్పడంతో.. విచారణను సీబీఐ కోర్టు ఆగష్టు 25కు వాయిదా వేసింది.

Related posts