youngsters choosing research as their option

యువకులే ఇక మార్గదర్శకులు…

79

దేశపరిస్థితులు మారుతున్నాయా…అంటే అవుననే చెప్తుంది ప్రస్తుత పరిస్థితి. ఏ దేశంలోనైనా యువతకే ప్రాతినిధ్యం ఎక్కువ, వారు ఎటు కోరుతుంటే అటే వెళుతుంది దేశమనుగడ కూడా. అలాగే జరుగుతుంది ప్రస్తుతం, యువత అంతా ఒకప్పుడు విదేశాలకు వెళ్ళాలనో లేదా ప్రభుత్వ ఉద్యోగం సాధించి ప్రశాంతగా జీవించాలని కలలు కని అవి సాదించుకునేవారు.

మరి ఇప్పుడు పరిస్థితి మారింది, యువత స్వదేశంలోనే పరిశోధన చేసి వారి జ్ఞానం దేశం కోసమే వినియోగించాలని కోరుకుంటున్నారు. ఇదొక్కటి చాలదా యువత దేశాన్ని గమనిస్తున్నారనటానికి, ఇక అందరు జాగర్తగా ఉండక తప్పదు ఎందుకంటె యువత మేలుకుంది, దేశాన్ని రక్షించుకోవాలనుకుంటుంది.

ఇటీవల విడుదలైన జె.ఈ.ఈ ఫలితాలలో సాధించిన వారినుండి బి.టెక్ విద్యార్థుల వరకు అందరు స్వదేశంలోనే పరిశోధన విభాగంలో చదువులు కొనసాగించి దేశాభ్యుదయానికి తోడ్పడాలని కోరుకుంటున్నారు.

ఐఐటీలో విజయం సాధించిన హేమంత్ కుమార్, బి.జిష్ణు, జి.సాయి అభిషేక్ తదితరులు పరిశోధన వైపు మొగ్గుచూపుతున్నట్టు చెప్పారు. వీరి ఆశల మేరకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ సైన్స్ బెంగుళూరు లో సీట్లు సాధించాలని కోరుకుంటున్నారు. అప్పుడు వారనుకున్నట్టు పరిశోధన విభాగంలో వారి కలలు పండించుకోవచ్చని వారి ఆశ.

ఇక 2017 జె.ఈ.ఈ లో విజయం సాధించిన వారు మోహన్ అభ్యస్ ఇప్పటికే పరిశోధనలో తన విద్యాబ్యాసాన్ని కొనసాగించాలని అడుగులు వేస్తున్నారు. మోహన్ కు ఫిజిక్స్ లో పరిశోధన చేయాలని ఉందట.

అలాగే హైదరాబాద్ కు చెందిన బి.వెంకట పవన్ (జె.ఈ.ఈ లో 11వ ర్యాంకర్) రోబోటిక్స్ మరియు గేమింగ్ రంగంలో పరిశోధన చేయాలని ఉందని అన్నారు. డి.సాయి కిరణ్ (24వ ర్యాంకు) క్వాంటమ్ థియరీ లో పరిశోధన చేయాలని చెప్పారు.

రావూరి ప్రఫుల్ ఆస్ట్రానమీ విభాగంలో పరిశోధన చేస్తానని చెప్పారు. ఇవన్నీ చేయుస్తుంటే దేశపరిస్థితులను బట్టి యువత కూడా వారి దిశను మార్చుకున్నట్టుగా తెలుస్తుంది. యువతలో ఇటువంటి మార్పు ఆహ్వానించదగ్గదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామం రేపటి బలమైన భారత నిర్మాణానికి దారి తీస్తుందని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.