telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

అతిపిన్న వయసులో కంప్యూటర్ ప్రోగ్రామర్‌గా రికార్డు…

అతిపిన్న వయసులోనే కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను అభ్యాసం చేసేశాడు. ఈ ఘనత సృష్టించింది ఎవరో విదేశాల కుర్రాడు కాదు. మన భారతీయుడు అది ఎన్ని సంవత్సరాల వయసులోనో వింటేనే ఆశ్యర్యపోతారు. కేవలం 6 సంవత్సరాల కల్లా కంప్యూటర్ ప్రోగ్రామర్‌గా రికార్డును సోంతం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్‌కు అర్హమ్ ఓమ్ టాల్సానియా అనే కుర్రాడు ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే తన తండ్రి తనకు కంప్యూటర్ కోడింగ్ నేర్పించాడని, దాని తరువాత తాను పైథాన్ కంప్యూటర్ కోడింగ్ కోర్సును పూర్తిచేశానని తెలిపారు. ‘దాని తరువాత సర్టిఫికేట్ కోసం దరఖాస్తు పెట్టుకున్నాను. అంతకు ముందే నేను కొన్ని చిన్న గేమ్స్ తయారుచేశాను. అయితే సర్టిఫికేట్ ఇవ్వడానికి వారు ఏదైనా నేను సొంతంగా చేసింది చూపమని అడిగారు. దాంతో నేను తయారు చేసిన గేమ్స్‌ను వారుకు పంపడంతో కొన్ని నెలల వ్యవధిలో వారు నాకు సర్టిఫికేట్ ఇచ్చరు. దాంతో నేను ఈ రికార్డ్ చేశాన’ని ఆ కుర్రాడు తెలిపాడు. అయితే గేమ్స్ చేయడం, ఆప్‌లు రూపొందిచడం అంటే తనకు ఇష్టమని, దాని ద్వారా ఇతరులకు ఉపయోగపడాలని అతడు కలలు కంటున్నాడని తెలిపాడు. టాల్సేనియా చిన్నప్పటి నుంచే గ్యాడ్జెట్స్‌పై ఆసక్తి చూపేవాడని, దాంతో అతడు ప్రోగ్రామ్ నేర్చుకున్నాడని తండ్రి తెలిపారు.

Related posts