telugu navyamedia
ట్రెండింగ్ సామాజిక

ఏకధాటిగా .. 125 గంటలు నాట్యం చేసి.. రికార్డు సాధించిన యువతి..

young girl record on dancing 125 hours

అవకాశాలను అందిపుచ్చుకోవడంలో యువత చాలా చురుకుగా ఉన్నారు. అయితే చాలా మందికి సరైన మార్గదర్శి లభించక లక్ష్యాలు సాధించలేక, జీవితాలను బలవంతంగా ముగించుకుంటున్నారు. కొందరు మాత్రమే తమదైన శైలిలో లక్ష్యాలను సాధిస్తున్నారు. నేపాల్‌కు చెందిన 18 ఏళ్ళ యువతి వందనా నేపాల్ రికార్డు సృష్టించింది. ఏకబిగిన 126 గంటలపాటు డ్యాన్స్ చేసి గిన్నిస్ బుక్ వాల్డ్ రికార్డుల కెక్కింది.

ఖాట్మండూలో జరిగిన కార్యక్రమంలో నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలి ఆమెను ఘనంగా సన్మానించారు. తూర్పు నేపాల్ లోని ధంకూటా జిల్లాకు చెందిన వందనా నేపాల్..తన ఫీట్‌ను గిన్నిస్‌బుక్ వారు గుర్తించారని, రికార్డుల పుస్తకంలో నమోదు చేస్తామని అధికారికంగా తెలిపారని వెల్లడించింది. గతంలో-2011లో ఇండియాకు చెందిన కలమందళం హేమలత అనే యువతి 123 గంటలపాటు చేసిన డ్యాన్స్ రికార్డును వందన బద్దలు కొట్టింది.

Related posts