telugu navyamedia
రాజకీయ

యూపీ ఎన్నికలు : గోరఖ్‌పూర్ నుంచి సీఎం యోగి నామినేషన్ దాఖ‌లు…

ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల కోసం బీజేపీ నేత, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ గోరఖ్​పుర్​లో నామినేషన్​ దాఖలు చేశారు. ఆయనతో పాటు కేంద్రమంత్రి అమిత్​ షా, బీజేపీ నేత‌లు కూడా హాజరయ్యారు. యోగి నామినేషన్ కార్యక్రమంతో ఆ ప్రాంతం అంతా కాషాయ రంగుతో నిండిపోయింది.

తొలిసారిగా సొంత ​ నియోజక వర్గం నుంచి ​అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. గతంలో ఆయన ఐదుసార్లు గోరఖ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.

Uttar Pradesh Assembly Election 2022: Yogi Adityanath, Flanked By Amit  Shah, Files Papers For 1st State Polls

ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో జరగనున్న ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భాజపా.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా సీఎం ఆదిత్యనాథ్‌ను ప్రకటించింది. మరోవైపు ప్రతిపక్ష నాయకుడు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా మెయిన్‌పురిలోని కర్హాల్ నుంచి పోటీ చేస్తున్నారు.

Assembly Elections 2022 LIVE Updates: Yogi Adityanath Files Nomination From  Gorakhpur In UP

కాగా..యోగి శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేసే ముందు లక్నోలో విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. సమాజ్‌వాదీ పార్టీ అభివృద్ధి కేవలం ‘కబ్రీస్థాన్‌’ (శ్మశాన వాటిక) సరిహద్దు గోడలకే పరిమితమైందని, అయితే బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో ఉత్తరప్రదేశ్‌ను శ్రేయస్సు పథంలో నడిపిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంతకుముందు ఆరు, ఏడో స్థానాల్లో ఉండగా రెండో స్థానానికి చేరుకుందన్నారు. “గత ఐదేళ్లలో, మేము ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచాము. పెట్టుబడిదారులు మరియు పారిశ్రామికవేత్తలకు మేము అనుకూలమైన వాతావరణాన్ని అందించాము, ఇది ఉపాధి కల్పనకు కూడా దారితీసింది” అని ఆయన చెప్పారు.

Related posts