Yogi Aditya Nath gave a bounced cheque

యోగి ఆదిత్యనాథ్…చెల్లని చెక్కు…!

51

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు సమస్యలో పడ్డాడు, వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ (యూ.పి.ఎస్.ఈ.బి) 10వ తరగతి పరీక్షల్లో ఏడో స్థానం సాధించిన అలోక్ మిశ్రా అనే విద్యార్థి 93.5 శాతం మార్కులు సాధించినందుకు గాను మే 29న లక్నోకు ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. అతను పేద విద్యార్ధి కావడంతో కావడంతో ఉన్నత విద్య దృష్ట్యా అతనికి 1 లక్షల రూపాయలు సహాయం చేయడం కోసం ముందుకొచ్చి చెక్ రూపంలో అందజేశాడు, అయితే ఆ చెక్ ఇప్పుడు బౌన్స్ అయిందని, దానికోసం జరిమానా కూడా చెల్లించాల్సొచ్చిందని ఆ విద్యార్ధి ఆందోళన చెందుతున్నాడు.

పూర్తి సమాచారం ప్రకారం యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన చెక్కును అలోక్ మిశ్రా తండ్రి డబ్బులకోసం, జూన్ 5న లక్నోలోని ఒక బ్యాంకులో వేయగా సంతకాల అసమతుల్యత కారణం చేత బౌన్స్ అయిందని బ్యాంక్ అధికారులు తెలపడంతో షాక్ కు గురయ్యారు. ఆ చెక్కులో జిల్లా పాఠశాలల అధికారి రాజ్ కుమార్ యాదవ్ గారిచేత సంతకం చేసి ఉందని విద్యార్ధి అధికారులను సంప్రదించగా అతనికి మరొక చెక్కును ఇచ్చారు.

ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన జిల్లా మేజిస్ట్రేట్ ఉదయ్ భాను త్రిపాఠి, కారకులైన వారిపై చర్యలు తీసుకుంటానని తెలిపారు.