yoga benefit as to relief stress

ఒత్తిడి తగ్గడానికి యోగా ఓ ఉత్తమ మార్గం..

194

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఒత్తిడికి లోనవుతుంటారు. ప్రస్తుత రోజుల్లో తీరికలేని ఒత్తిడితో కూడిన జీవితం ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపుతున్నది. జీవితంలో వివిధ కారణాల వల్ల మనం తరచూ ఒత్తిడికి గురి అవుతూ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నాము. ఒత్తిడికి గురైన వారు ప్రశాతంగా నిద్రపోలేకపోతున్నారు. ఏదో ఆందోళన, భయం, డిప్రెషన్ వల్ల ఆరోగ్యం మీద చెడు ప్రభావాలు చూపుతున్నాయి. ఈ ఒత్తిడి తగ్గించుకొనేందుకు ఒక ఉత్తమ మార్గం ఉన్నది అదే యోగా.

yoga benefit as to relief stress

ప్రతి రోజు యోగా చేయడం వల్ల ప్రశాంతమైన నిద్రను పొందవచ్చు . యోగా వల్ల శరీరంలోని అవయావాలు విశ్రాంతిపొంది, జీవితం ఆనందంగా ముందుకు నడవడానికి సహాయపడుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఆందోళన మరియు ఒత్తిడి రెండూ ఏదో ఒక సందర్భంలో కలిగి ఉంటారు. అయితే, ఈ రెండు లక్షణాలను దీర్ఘకాలం పాటు అలాగే ఉంచుకోకుండా, ఏమాత్రం ఒత్తిడి యొక్క లక్షణాలను కనిపించినా వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఎప్పడైతే అధిక ఒత్తిడికి గురైతే, కార్టిసోల్ అనే హార్మోన్ రక్తకణాల్లో విడుదల అవుతుంది. ఈ హార్మోన్ మీ శరీరాన్ని మరింత నాశనం చేస్తుంది. జీవక్రియల ప్రక్రియను తగ్గిస్తుంది మరియు రక్తపోటు పెరిగి గుండె మీద ఒత్తిడి పెంచుతుంది. ఈ హార్మోన్ యొక్క ప్రభావం నుండి బయటపడాలంటే ఒత్తిడి నుండి ఉపశమనం పొందాలి. అందుకు యోగా అద్భుతంగా సహాయపడుతుంది. యోగా, వ్యాయామం కంటే మరింత ప్రయోజనకారి గా ఉంది. యోగా వల్ల శరీరంలోని ప్రతి ఒక్క అవయవానికి కదలిక కలిగి ఉంటుంది. ప్రతి ఒక్క అవయవం, కండరాలు కదలిక వల్ల జీవక్రియలు చురుకుగా పనిచేయడం మాత్రమే కాదు, ఒత్తిడి కూడా చాలా త్వరగా తగ్గిస్తుంది. మనస్సు ప్రశాంతపరుస్తుంది .

yoga benefit as to relief stress

ఒత్తిడిని తక్కువగా అంచనా వేయకుండా వెంటనే యోగా ప్రాక్టిస్ చేస్తూ మీలో ఉన్న ఒత్తిడిని పారద్రోలండి… ఒత్తిడి నుండి ఉపశమనం కోసం

యోగా : సుఖాసన: ఒత్తిడి తగ్గించుకోవడంలో ఇది ఒక సలుభమైనటువంటి యోగాసనం. పద్మాసనంలో కూర్చొని, తర్వాత కాళ్ళను రెండింటిని పైకి మడవాలి. తర్వాత మనస్సును ప్రశాంత పరుచుకోవాలి. శ్వాసనెమ్మదిగా పీల్చి వదలడం వల్ల మనస్సు ప్రశాంతపడుతుంది. అంతే కాదు, వెన్నెముకకు విశ్రాంతి లభిస్తుంది.

yoga benefit as to relief stress

ప్రాణాయామం: ప్రాణం + ఆయామం = ప్రాణాయమం. ప్రాణమంటే జీవన శక్తి. ఆయామం అంటే విస్తరింపచేయుట లేక నియంత్రించి ఉంచుట అని అర్ధం. పతంజలి మహర్షి ప్రసాదించిన యోగ సూత్ర ప్రకారం శ్వాస, నిశ్వాసల్ని నియంత్రించి ఉంచడమే ప్రాణాయామం అని నిర్ధారించడం జరిగింది. లోనికి పీల్చే గాలిని శ్వాస అని, బయటికి వదిలే గాలిని ప్రశ్వాస అని అంటారు. శ్వాస ప్రశ్వాసల్ని నియంత్రించడం, క్రమబద్దం చేయడం ద్వారా అంతర్గత సూక్ష్మప్రాణాన్ని కూడా అదుపులో ఉంచవచ్చు.

yoga benefit as to relief stress

నాడీమండలం, రక్త ప్రసార ధమనులు, జీర్ణకోశం, మూత్రకోశం మొదలుగా గల వాటన్నిటిలో ప్రాణం సంచరిస్తూ ఉంటుంది. ప్రాణాయామం వల్ల వాట న్నింటికి శక్తి, రక్షణ కల్పిస్తాయి. కనుకనే ‘‘ ప్రాణా యామేన యుక్తేన సర్వరోగ క్షయ భవేత్‌” అంటే ప్రాణాయామం నియమబద్ధంగా ఆచరిస్తే సర్వరో గాలు హరించిపోతాయి అనే సూత్రం ప్రచారం అయ్యింది. నిత్యం బిజీ లైఫ్ లో వారి దినచర్యలో భాగంగా ఎదో సమయంలో ఒత్తిడికి లోనవుతుంటారు అలాంటి వాటిని నివారించేందుకు యోగా ఎంతో ఉపకరిస్తోందని యోగా గురువులు చెబుతున్నారు.

yoga benefit as to relief stress