telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఎన్నికల ప్రచారంలో కొత్త పంథా… వైసీపీ మైండ్ గేమ్!

YCP padma comments Chandrababu
ఎన్నికలు సమీపించే కొద్దీ ప్రతిపక్ష నాయకుడు జగన్‌కు సంబంధించిన  దుర్మార్గాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో జగన్ తప్పుమీద తప్పు చేస్తున్నారంటూ ఎన్నికల ప్రచార సభలో విమర్శిస్తున్నారు. దిక్కు తోచని స్థితిలో పడిపోయిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎంతటి అరాచకాలకైనా రెడీగా ఉందని, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పార్టీ అధినేత శ్రేణులకు సూచించారు.  జగన్ కు బీహార్ క్రిమినల్ ప్రశాంత్ కిశోర్ తోడయ్యారని, ప్రశాంత్ కిశోర్ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, ఫామ్ 7 ద్వారా ఓటర్లను తొలగించే ప్రయత్నాలు చేసినట్టు ఆరోపించారు. 
ప్రశాంత్ కిశోర్ తప్పుడు వార్తలతో నేతలను భయపెడుతున్నారని, టీడీపీ ఆర్థికమూలాలను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆయన అన్నారు. కుట్రలు, కుతంత్రాలు చేయడం వైసీపీకి అలవాటేనని ఆయన అన్నారు. కోడి కత్తి మొదలుకొని, ఉద్దండ్రాయిని పాలెంలో అరటితోట దగ్ధం వరకు  వైసీపీ కుట్రలో భాగమేనని ఆరోపిస్తున్నారు. మొన్న జరిగిన బాబాయి హత్యను కూడా జగన్ రాజాకీయంగా వాడుకోవాలని ప్రయత్నిస్తున్నాడని విమర్శలు వెళ్లువిరుస్తున్నాయి. రాజకీయ బద్దశత్రువులైన నాయకులను టీడీపీ కల్పడానికి ప్రయత్నిస్తుంటే, జగన్ మాత్రం కుట్రలు పన్నుతున్నారాని ఆరోపిస్తున్నారు.  వైఎస్ జగన్ అవినీతిని ఆసరాగా చేసుకుని ప్రధాని మోదీ, కేసీఆర్ లు ఏపీలో కుట్రలు చెయ్యాలని ప్రయత్నిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. 
తెలంగాణ సీఎం కేసీఆర్ కు వైఎస్  జగన్ దాసోహం అయ్యారంటూ విరుచుకుపడ్డారు. సైబర్ నేరగాళ్లంతా వైసీపీలో చేరారని సీఎం చంద్రబాబు అన్నారు. నేరగాళ్ల కేరాఫ్‌ అడ్రస్‌గా వైసీపీ మారిందని తెలిపారు. మైండ్‌ గేమ్‌లోనే కాదు.. సైకో గేమ్‌లోనూ జగన్‌ దిట్ట అని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడిస్తామన్నారు. దొంగ సర్వేలతో మైండ్‌గేమ్‌ ఆడినా.. కుట్రలు పన్నినా టీడీపీ గెలుపును ఎవ్వరూ ఆపలేరని పలు సభల్లో  చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. 

Related posts