టీడీపీ నేత ఉమా యాదవ్ దారుణ హత్యకు సంబంధించి మద్దాయిలైన వైసీపీ నేత తోట శ్రీనివాసరావు యాదవ్ తో పాటు ఆయన అనుచరులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మంగళగిరిలోని నాలుగు రోడ్ల కూడలి జంక్షన్ లో జనం చూస్తుండగానే ఈ హత్య జరిగింది. ఈ హత్యకు వైసీపీ నేతే కారణమంటూ ఆయన ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించడంతో మంగళగిరిలో ఉద్రిక్తత నెలకొంది.
హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాకపోయినా, ఆధిపత్య పోరే హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పాతకక్షలు, రియలెస్టేట్ లావాదేవీలు, ఆధిపత్య పోరు వంటివి తెరపైకి వస్తున్నాయి. ఎన్నికలకు ముందు తన అనుచరులతో కలసి ఉమా యాదవ్ టీడీపీలో చేరారు. గతంలో జరిగిన బేతపూడి సర్పంచ్ బత్తుల నాగసాయి హత్య కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉండటం విశేషం.
ప్రాజెక్టు నిర్మాణాలను తప్పుబట్టిన కోదండరాం