telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

అక్కడ బ్యాలెట్ పత్రాలు చించేసి వైసీపీ నాయకులు…

ycp ap

సర్పంచ్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా వైసీపీ నాయకులు వీరంగం సృష్టించి బ్యాలెట్ పత్రాలు చించివేయడంతో పాటు కొన్ని పత్రాలు తీసుకుని పరారయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి ఏడుగురు వైసీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం కందరాడలో ఉత్కంఠభరితంగా రీపోలింగ్ జరిగింది. కందరాడగ్రామంలో ఈ నెల 9వ తేదిన జరిగిన ఈ ఘటన నేపధ్యంలో జిల్లా కలెక్టరు సర్పంచ్ ఎన్నిక రీపోలింగ్ కు ఆదేశించారు. ఈరోజు రీపోలింగ్ అనంతరం కౌంటింగ్ జరిగింది. ఈ కౌంటింగ్ లో వైసీపీ మద్దతుదారయిన సర్పంచ్ అభ్యర్థిని సైతన నాగ భారతి తన సమీప ప్రత్యర్థి టీడీపీ మద్దతుదారయిన పిల్లా సుశీలపై 76 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఓట్ల లెక్కింపును కాకినాడ ఆర్డీవో చిన్ని కృష్ణ పర్యవేక్షించగా, రీ పోలింగ్ ను జిల్లా కలెక్టరు మురళీధరరెడ్డి పరిశీలించారు. పోలయిన 2690 ఓట్లలో నాగభారతికి 1348 ఓట్లు రాగా ,టీడీపీ మద్దతుదారు పిల్లా సుశీలకు 1272 ఓట్లు లభించాయి. మరో అభ్యర్థి దంట కుమారికి 9 ఓట్లు, నోటాకు0ఓట్లు రాగా చెల్లని ఓట్లు 81 వచ్చాయి..ఆఖరి ఫలితం వెలువడిన అనంతరం సైతన నాగభారతి ఆర్వో మరియు ఆర్డీవో చేతులు మీదుగా డిక్లరేషన్సర్టిఫికెట్ అందుకున్నారు.

Related posts