ఏపీలోని వివిధ జిల్లాల్లో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలోని నాదెండ్ల మండలం తూబాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలపై వైసీపీ వర్గీయులు శనివారం దాడికి పాల్పడ్డారు. ఈఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
స్థానిక ఎస్సీ కాలనీలోని టీడీపీ కార్యకర్త అంకమ్మ ఇంటి ఎదురుగా రోడ్డుకు అడ్డంగా వైసీపీ వర్గీయులు మొక్కలు నాటారు. దీనిపై ప్రశ్నించిన అంకమ్మ కుటుంబ సభ్యులపై వైసీపీ వర్గీయులు గొడ్డళ్లతో దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన అంకమ్మ కుటుంబ సభ్యలను గుంటూరు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఈ ఘటనతో గ్రామస్థులు బయాందోళనకు గురవుతున్నారు.