telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ప్రపంచంలోనే.. అత్యధిక ట్రాఫిక్ నగరంగా.. బెంగుళూరు..

worlds highest traffic city bangalore

ట్రాఫిక్ రద్దీపై ప్రపంచవ్యాప్తంగా 57 దేశాల్లోని 416 నగరాల్లో నెలకొన్న ఓ సర్వే నిర్వహించిన టామ్ టామ్ అనే సంస్థ అత్యంత రద్దీ నగరం బెంగళూరని తేల్చింది. ట్రాఫిక్ ఇండెక్స్ పేరిట ఈ నివేదిక విడుదల కాగా, బెంగళూరు వాసులు సగటున ట్రాఫిక్ లో 71 శాతం అధిక సమయాన్ని వెచ్చిస్తున్నారని పేర్కొంది.

నగరంలో ఉండేవారు ఏడాదిలో సగటున 243 గంటలు ట్రాఫిక్ లో గడుపుతూ ఉన్నారని పేర్కొంది. ఇక టాప్ 10 అత్యధిక ట్రాఫిక్ రద్దీ ఉన్న నగరాల్లో పలు భారత నగరాలు చోటు సంపాదించాయి. ముంబై నాలుగో స్థానంలో, పుణె 5వ స్థానంలో, ఢిల్లీ 8వ స్థానంలో ఉన్నాయి. వీటితో పాటు టాప్ టెన్ లో మనీలా, బొగోటా, మాస్కో, లిమా, ఇస్తాంబుల్, జకార్తా నగరాలున్నాయి.

Related posts