world yoga day5

అంతర్జాతీయ యోగా దినోత్సవం…

203

శరీరాన్ని కాస్త కూడా కదిలించే పని కానీ కదిలించాలని అనుకునేలోపే ఏదో ఒకపని మళ్ళి చేయాల్సి వచ్చి అసలు శరీరాన్ని కదిలించటమే మానేశాము. మరి ఆరోగ్యం ఎలాగూ, అంటే మార్కెట్ లో ఎన్నో ఉపకరణాలు ఉన్నాయి, అందులో శరీరం కదిలించకుండానే పని చేసుకుంటూ కొవ్వు కరిగించే అనేక పరికరాలు కూడా అందుబాటులోకి వచ్చాయి…కానీ తెలిసిన వాళ్లెవరు అవి వాడి ప్రయోజనం కాదు కదా కనీసం దుష్ప్రభావాలు కలగకపోతే మంచిదే, ఏమంటారు..

world yoga day1

అందుకే అప్పటిలో అందరు ఏదొక పనిలో నిమగ్నమై శరీరం అలసిపోయి చమట రూపంలో అనేక విషాలు శరీరం బైటికి పంపిస్తుంది. మరి అలాంటి వేమి లేకుండానే చెమట పట్టనెపట్టని సౌకర్యాలతో బ్రతుకుతూ చాలా సుఖంగా ఉన్నాం అనుకుంటూ దీర్ఘకాలంలో రోగాలపాలవుతున్నాం, అంతేనా అంటే కాదు సదరు రోగాలను వారసత్వంగా తరువాత తరాలకు కూడా అందిస్తున్నాం. మరి వీటన్నికి పరిస్కారం…పరిష్కరాలైతే ఎప్పుడూ ఉండనే ఉన్నాయి, కానీ వాటిని అనుసరించే స్థితిలో మనం లెమనే చెప్పాలి, ఇంకా ఘోరం ఏమంటే ఆరోగ్యం కోసం కాస్త సమయం వెచ్చించలేని వారు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు..

world yoga day2అలా కాకుండా కాస్తంత సమయం వెచ్చిస్తే అన్నివిధాలుగా ఆరోగ్యాన్ని మన చేతులతో మనమే మనకు ఇచ్చుకునే అత్యంత అద్భుతమైనగా బహుమతిగా చెప్పుకోవచ్చు..దీనికేం చేయాలి…కాస్త సమయం వెచ్చించి యోగాబ్యాసం చేయాలి.

world yoga day01

యోగా- అని పేరు చెప్పగానే ఆమ్మో యోగానా…శరీరాన్ని అలా ఇష్టం వచ్చినట్టు వంచడం మావల్ల కాదు బాబోయ్ మమ్మల్ని వదిలేయం.. అనే అనిపిస్తుంది మొదటిలో ఎవ్వరికైనా.. కానీ కాస్త అలవాటు అయితే చాలా హాయిగా ఉంటుంది. ఓ మంచి అలవాటు చేసుకోడానికి సమయం పట్టినా అది మన జీవితాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతుంది..అని పెద్దలు చెప్పే మాట.

world yoga day3యోగా భారతదేశంలో ఎప్పటినుండో వస్తున్న అతి పురాతనమైన ఆరోగ్య రహస్యం అని స్పష్టంగా చెప్పవచ్చు. యోగా రోజు రెండు లేదా మూడు ఆసనాలతో మొదలుపెట్టి అవి బాగా శరీరానికి అలవాటయ్యాక కొత్తవాటిని ప్రయత్నించవచ్చు… ముందు ఎంచుకునే రెండు మూడు కూడా మన ఆరోగ్య అవసరాలను బట్టి చేస్తే ఫలితాలు తెలుస్తుంటాయి కాబట్టి ఇంకా చేయాలని ఆసక్తి పెరిగే అవకాశం ఉంటుంది. ఇలా ప్రారంభం చేయటం వల్ల అటు ఆరోగ్యం ఇటు ఆసక్తి రెండు ప్రయోజనాలు చేకూరుతాయి

world yoga day4ఒకవేళ మొదటిగా ప్రయత్నించే వారు దగ్గరలో ఉన్న యోగా శిక్షణా కేంద్రానికి వెళ్లి నేర్చుకోవచ్చు లేదా ఇటీవల ఇంటివద్దకే వచ్చి శిక్షణ ఇచ్చే వారుకూడా ఉన్నారు, అలా కూడా మెల్లిమెల్లిగా శరీరాన్ని దారిలో పెట్టవచ్చు. అదేదో సామెత చెప్పినట్టు…మెల్లగా వెళుతున్నందుకు..విచారపడక…ఉన్న చోటే ఉండనందుకు సంతోషపడాలి.

world yoga day8కొత్తగా ఏది మొదలు పెట్టిన అది మనకు అలవాటు కావటానికి కాసింత సమయం పడుతుందని గ్రహించి సహనంతో ముందుకు సాగితే అంతా అనుకున్నట్టే జరుగుతుంది. యోగాకి అంతర్జాతీయంగా కూడా గుర్తింపు వచ్చింది, జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. కనుక ఈ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మనము రోజు కాసేపు యోగా చేయాలని పూనిక తీసుకోని ఆరోగ్య భారత నిర్మాణంలో భాగస్వాములం అవుదామా.

world yoga day7