telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

భారత్ .. మరిన్ని సంస్కరణలకు తెరతీయాలి.. : ప్రపంచ బ్యాంకు

modi meeting with world bank president

మోదీ ప్రభుత్వం పెట్టుబడిదారులను ఆకర్షించాలంటే ఇప్పుడు చేపడుతున్న కార్పొరేట్‌ పన్ను తగ్గింపు వంటి సంస్కరణలు సరిపోవని, మరిన్ని చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని ప్రపంచబ్యాంక్‌ అభిప్రాయపడింది. భూ సేకరణ, కార్మిక, లాజిస్టిక్స్‌ వంటి అంశాల్లో సంస్కరణలు అవసరమని ప్రపంచబ్యాంక్‌ ఆర్థికవేత్త ఆదిత్య మాట్టో అన్నారు. వాణిజ్య భయాల వల్ల చైనా నుంచి పెట్టుబడులు తరలిపోతున్నా.. అవి భారత్‌వైపు మళ్లకపోవడానికి కారణమదేనని ఆయన పేర్కొన్నారు.

సులభతర వాణిజ్యంలో భారత్‌ 14 స్థానాలు ఎగబాకి 63వ స్థానానికి చేరినప్పటికీ.. భారత్‌లో లాజిస్టిక్స్‌ ఖర్చుల విషయంలో చైనాతో పోల్చినప్పుడు మూడు రెట్లు, బంగ్లాదేశ్‌తో పోల్చినప్పుడు రెండు రెట్లు అధికంగా ఉన్నాయి. అదే సమయంలో భూ సేకరణ కష్టంతో కూడుకున్నది. ఇలాంటి విషయాల్లో సంస్కరణలు అవసరమని మాట్టో అభిప్రాయపడ్డారు. వాణిజ్య యుద్ధం వృద్ధిపై ప్రభావం చూపుతుందని, ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య అనిశ్చితి తలెత్తితే భారత్‌ ఆదాయం, ఎగుమతులు కనీసం ఒక శాతం మేర తగ్గుతాయయని పేర్కొన్నారు. ఈ వాణిజ్య యుద్ధ భయాల ప్రభావం భారత్‌పై పడే అవకాశం ఉందని, వృద్ధి మందగించడం, పెట్టుబడులు తగ్గడం వల్ల మరో 70 లక్షల మంది భారతీయులు పేదరికంలోకి జారుకునే అవకాశం ఉందని మాట్టో అభిప్రాయపడ్డారు.

[ఇలా ఎవడి మీదో ఆధారపడకుండా, భారత్ తన సొంత ఉత్పాదకతను పెంచుకుంటే, సొంత ఆర్థిక వ్యవస్థ ఏర్పడి అభివృద్ధి సుగమం అవుతుంది. ఇది భారత ప్రభుత్వానికి ఎప్పుడు అర్ధం అవుతుందో అప్పుడు ఇలా ఎవరి ఉచిత సలహాలు వినాల్సిన పనిఉండదు. సొంత ఉత్పత్తితోనే సొంత ఆర్థికస్థితి సాధ్యం, అదే భారత్ కు ఉన్న అత్యంత బలం, బలగం. సాంప్రదాయ పద్దతిలో ఉత్పత్తి సాగించడం ద్వారా ఉద్యోగాల కల్పన(జీతాలు తక్కువైనా అందరికి ఉద్యోగం ఉండాలి, ఇంటిలో నాలుగురుంటే వారందరికీ కూడా సంపాదన ఉండేవిధంగా) భారీగా సాధ్యం అవుతుంది.. తద్వారా నిరుద్యోగ సమస్య భారత్ లో కనిపించదు. ఆ సమస్య ద్వారా ఉత్పన్నమవుతున్న ఎన్నో ఇతర సమస్యలు(నక్సలిజం, తిరుగుబాటు దారులు, నేరాలు, అత్యాచారాలు) కనుమరుగైపోయాయి. సొంత ఆర్థికవ్యవస్థ దేశానికి వెన్నెముక లాంటిది, ప్రపంచంలో అన్నిదేశాలూ ఆర్థిక మాంద్యంలో కొట్టుకుపోయినప్పటికీ, పై చర్యలతో భారత్ ఖచ్చితంగా నిలదొక్కుకోవడం మాత్రమే కాదు, అభివుద్ది చెందిన దేశంగా ఖ్యాతి గాంచుతుంది. ఈ సంస్కరణలు తెచ్చే ధైర్యం ఈ ప్రభుత్వాలకు ఉందా అనేదే ప్రశ్న!]

Related posts