women murder in yerragadda hospital

ఎర్రగడ్డలో దారుణం…

36

హైద్రాబాద్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో గుర్తు తెలియని దుండగులు ఓ మహిళ రెండు కాళ్లను అత్యంత దారుణంగా నరికి హత్య చేశారు. ఆసుపత్రి భవనంపై నరికిన కాళ్ల ఆనవాళ్లు ఉన్నట్లు తెలిపారు అధికారులు. ఈ ఘటన గురించి సమాచారం అందటంతో ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులు, క్లూస్ టీంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హాస్పిటల్ లో ఎవరైనా మానసిక రోగి కనిపించకుండా పోవటం వంటివి జరిగిందా, ఇంకా ఆ మహిళ ఎవరు..? అనే కోణంలో దర్యాప్తు సాగుతుంది. మృతిరాలి వయసు దాదాపు 35 సంవత్సరాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.