women attacked by kid

బాలురపై…కూడానా…

27
ఇప్పటివరకు బాలికలమీద అత్యాచారం చేసిన సంఘటనలు మనం చుస్తున్నాం, అయితే విజయవాడ నున్న లో దీనికి బిన్నంగా జరిగింది. నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న 14 ఏళ్ల బాలుడు మీద స్థానికంగా నివసిస్తున్న 45 ఏళ్ల వయసున్న వివాహిత మహిళా హత్యచారానికి పాల్పడింది.  నిన్న సాయంత్రం బాలుడిని ఇంట్లోకి పిలిచి అసభ్యంగా ప్రవర్థించింది లైగికంగ వేధింపులకు పాల్పడింది. దీనికి సంబంధించి బాలుడు బయపడి అతని తల్లితండ్రులకు చెప్పడంతో బాలుడి తల్లి వివాహిత మహిళ పై చెయ్యి చేసుకుంది. అనంతరం బాలుడుని తీసుకోని నున్న పోలీస్ స్టేషన్ కు వెళ్లి పిర్యాదు చేయడంతో పోలీసులు విచారించి లైంగికంగా బాలుడిపై వేధించినట్లు గుర్తిచారు, దీనితో ఫోక్సా చటం కింద కేసు నమోదు చేశారు. ఫోక్సా చటం ప్రకారం 2012 నుంచి  ఇది  అమల్లోకి వచ్చింది, మైనర్ బాలబాలికల ఎవరిమీదైనా అఘాయత్యంకి పాల్పడితే ఫోక్సా చటం కింద కేసు నమోదు చేస్తారు. గతంలో బాలికలకు సంబంధించి అనేక కేసులు నమోదయ్యాయి కానీ బాలుడి మీద కేసు నమోదవడంతో ఈ విషయం చేర్చనీయాంసంగా మారింది. 
ఇందులో భాగంగా లైంగికంగా వేధింపులకు పాల్పడిన మహిళను నున్న పోలీసులు అరెస్ట్ చేశారు. 15 రోజులో రిమాండ్ కు పంపనున్నారు, మరో వైపు ఈ కేసుకు సంబంధిచి బాలుడిని వైద్య పరీక్ష నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. దీనిపై లోతైన విచారణ చేస్తాం అన్ని పోలీస్ అధికారులు చెప్తున్నారు.