telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఏమి సినిమా టైటిల్ నాయనా… ! ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’.. చిత్రం పై మహిళల ఆగ్రహం.. !!

సినిమాలకు టైటిల్ విషయంలో ఏమాత్రం స్వతంత్రం ఉందొ తెలియదు కానీ, ఇష్టానికి పెడుతున్నారు. వాటిని చూసే ముందు ఆయా చిత్రాలపై వివాదాలు మొదలు అవుతున్నాయి. తాజాగా, ఈ కోవలో విడుదలైన చిత్రం చీకటి గదిలో చితక్కొట్టుడు. ఈ సినిమా ట్రైలర్ నుంచే సృష్టించిన ప్రకంపనలు అన్నీఇన్నీ కావు. సినీ బూతుకు పరాకాష్టలా నిలిచింది. ఈ చిత్రం రిలీజ్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చీకటి గదిలో చితక్కొట్టుడు టైటిల్ నుంచి పోస్టర్ల వరకు అన్నీ అభ్యంతరకంగా ఉన్నాయంటూ ఎక్కడో ఒక చోట నిరసనలు తెలుపుతూనే ఉన్నారు.

women angry with tollywood movieతాజాగా, వైజాగ్ గాజువాక లక్ష్మీకాంత్ థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమా హాల్లో ప్రదర్శితమవుతున్న చీకటి గదిలో చితక్కొట్టుడు చిత్రాన్ని వెంటనే నిలిపివేయాలంటూ మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. ఐద్వా నేతృత్వంలో పెద్ద ఎత్తున మహిళలు లక్ష్మీకాంత్ థియేటర్ ను చుట్టుముట్టడంతోపాటు పోస్టర్లు చించివేసి, నినాదాలు చేశారు. యువతను భ్రష్టుపట్టించే ఇలాంటి సినిమాలను ప్రదర్శించడం నిలిపివేయాలంటూ డిమాండ్ చేశారు. ఇలాంటి సినిమాలకు సెన్సార్ సర్టిఫికెట్ ఎలా ఇస్తారంటూ మహిళా సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.

Related posts