ఈ రోజు జరిగే కేంద్ర కేబినెట్ భేటీ కి అంత ప్రాధాన్యత ఎందుకు ?

17

పార్లనెంట్ హౌస్ లో ప్రధాని అధ్యక్షతన కేంద్ర కేబినెట్ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు భేటీ కానుంది. కేబినెట్ మీటింగ్ కు హాజరుకానున్న కేంద్ర మంత్రులు. సార్వత్రిక ఎన్నికలు, ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించే అవకాశం. 7 నెలల తర్వాత పూర్తిస్థాయిలో భేటీకానున్న మంత్రులు. కేంద్ర పథకాల అమలు ,రైతాంగ సమస్యలు, సొంత సర్వేలు వంటి అంశాలపై కేంద్ర మంత్రి మండలి చర్చించనట్టుంది. రైతులకు భారీ వరాలు ప్రకటించే అవకాశం ఎన్నికల దృష్ట్యా ఉంది. ప్రజల్లో ఎక్కువగా ఉండాలని సూచించే అవకాశం ఉంది. సంవత్సర కాలంలో ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఇప్పుడు జరగనున్న కేంద్ర కేబినెట్ మీటింగ్ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశానికి కేబినెట్ తో పాటు ఇతర మంత్రులు హాజరుకానున్నారు.