నర్సాపూర్ నియోజకవర్గం 2019 ఎన్నికల్లో సునీత లక్ష్మా రెడ్డి కి ‘జై’ అనబోతుందా? మదన్ రెడ్డి కా?

120

2019 ఎన్నికల్లో మాజీ మంత్రి సునీత లక్ష్మా రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యే గా గెలవబోతున్నారా, కేవలం 2014 ఎన్నికలలో 14,000 ఓట్ల తేడాతో ఓడిన సునీత లక్మారెడ్డి తిరిగి ప్రజాభిమానాన్ని తిరిగి పొందుతున్నారని బలమైన ప్రతిపక్ష పాత్ర నియోజిక వర్గంలోనే కాదు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ పోషిస్తున్నారు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు, గత ఎన్నికల్లో సునీత లక్ష్మా రెడ్డి ఫై తెరాస నుండి పోటీ చేసిన మదన్ రెడ్డి 14,000 ఓట్ల మెజారిటీ తో గెలుపొందాడు, మరో అభ్యర్థి చాగన్ల బ్లవీందర్ నాథ్ బీజేపీ నుండి పోటీ చేయగా ఆయనకు 6,000 ఓట్లు వచ్చాయి.

who will be mla in narsapur in 2019

మొట్టమొదటి సారి సునీత లక్ష్మా రెడ్డి 1999 లో తన భర్త లక్ష్మా రెడ్డి మరణం తో రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా పోటీచేసి తన ప్రత్యర్థి చిలుముల విఠల్ రెడ్డి(సిపిఐ) ఫై విజయం సాధించారు, 2004 లో తన సమీప ప్రత్యర్థి మదన్ రెడ్డి (టీడీపీ ) ఫై గెలుపొందారు, తరువాత 2009 లోను సునీత లక్ష్మా రెడ్డి తన సమీప ప్రత్యర్థి చిలుముల కృష్ణారెడ్డి (సిపిఐ) ఫై ఘన విజయం సాధించారు, వరుసగా 3 సార్లు గెలిచిన సునీత లక్ష్మా రెడ్డి మంత్రి గా పలు దఫాలు పని చేశారు.

చరగని చిరునవ్వు, ఆప్యాయమైన పలకరింపు, అక్క అని వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యని విని పరిష్కరించే నేర్పు, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సమస్యలపై పోరాడే సత్తా, తెగువ ఆమె బలాలు. రాజీలేని పోరాటం ఆమె లక్షణం. 2014 ఎన్నికల్లో తెరాస గాలి లో ఆమె ఓడిన ఏ రోజు ప్రజలకు దూరంగా ఆమె ఉండలేదు, ప్రభుత్వం ఇచ్చిన హామీలను తీర్చాలని పేద, బడుగు బలహీన వర్గాల పక్షముగా కార్యక్రమాలు చేసింది, ప్రజా అభిమానాన్ని తిరిగి పొందింది. అందుకే కాంగ్రెస్ హైకమాండ్ రెండోసారి కూడా తననే డీసీసీ అధ్యక్షురాలిని చేసింది.

who will be mla in narsapur in 20192
ప్రస్తుత ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి అభివృద్ధిని అటకెక్కిన్చడం, తమ పార్టీ కి సంబందించిన కార్యకర్తలను తానే గుర్తించకపోవడం, ప్రజలకు దూరంగా ఉండడం తో ప్రతి పక్ష పార్టీలోనూ సునిత లక్ష్మా రెడ్డి కి అభిమానులు పెరిగారని సమాచారం. కెసిఆర్ నిర్వహిస్తున్న సర్వేల్లోనూ మదన్ రెడ్డి పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు అని తేలింది అని నిఘా వర్గాల సమాచారం.

who will be mla in narsapur in 20191

అలాగే ఆమె రాజకీయ వారసుడైన ఆమె మేనల్లుడు దొంతిరెడ్డి సంతోష్ రెడ్డి మెదక్ పార్లిమెంట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గెలుపొందారు, తాను వాళ్ళ అత్తమ్మ బాటలో తన పార్లమెంట్ నియోజకవర్గం లో యూత్ కాంగ్రెస్ ను బలోపేతం చేస్తూ విద్యార్థులు, నిరుద్యోగులు, రైతుల, పక్షాన పోరాడుతున్నారు జిల్లావ్యాప్తంగా యువకులను కాంగ్రెస్ వైపు ఆకర్షితులను చేస్తున్నారు, ఇది చూసిన అధిష్టానం రాబోయే ఎన్నికల్లో అభ్యర్థి లేకపోవడంతో కొన్ని నెలల క్రింద సంతోష్ రెడ్డి ని గజ్వెల్ నియోజకవర్గ అభ్యర్థిగా నిలుపుతుందని టీవీ ఛానెళ్లలో వార్తలు వచ్చాయి. చురుకైన యువ నాయకుడిగా ఉన్న సంతోష్ రెడ్డి సహితం అత్తమ్మ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారని ఎలాగైనా భారీ మెజారిటీ తో గెలిపించడానికి సామజిక సేవలు చేస్తూ అందరి ఆదర అభిమానుల్ని చూరగొంటున్నాడు.

బీజేపీ ఉన్నప్పటికీ అక్కడ బలమైన క్యాడర్ కానీ అభ్యర్థి కానీ లేకపోవడంతో, మదన్ రెడ్డి ముఖ్య అభ్యర్థి కావడంతో ప్రజలు వచ్చేఎన్నికల్లో సునీత లక్ష్మా రెడ్డి కి పట్టం కట్టనున్నటు జై కొట్టనున్నట్టు విశ్లేషకుల అంచనా.

-సంతోష్ కుమార్