2019 elections in Manthani

మంథని లో 2019 ఎన్నికలలో ఎవరికీ గెలిచే అవకాశాలు ఎక్కువ ?

21
కరీంనగర్ జిల్లాలో కాంగ్రస్ పార్టీ కి బలమైన పునాదులున్న నియోజకవర్గం మంథని ,నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి 13 సార్లు ఎన్నికలు జరిగాయి ,ఇందులో 10 సార్లు కాంగ్రెస్ పార్టీ  విజయం సాధించింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 4 సార్లు ఎమ్మెల్యే గా గెలుపొందగా  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా చేసిన  శ్రీపాదరావు 3సార్లు గెలుపొందారు ,తరువాత తన తనయుడు శ్రీధర్ బాబు కాంగ్రెస్ అభ్యర్థి గా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు ,ఈయన ప్రభుత్వ విప్ గా , రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు .నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తొలిసారిగా సోషలిస్టు పార్టీ అభ్యర్థి గుళికోట శ్రీరాములు గెలుపొందారు ,1994 లో టీడీపీ అభ్యర్థి చందుపట్ల రాంరెడ్డి ఎమ్మెల్యే గా గెలిచారు ,కాగా గడచినా ఎన్నికల్లో 2014  లో తెరాస అభ్యర్థి పుట్ట మధు 18000 మెజారిటీ తో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబు  ఫై గెలుపొందారు .
 
ఎంతో రాజకీయ అనుభవం, రాజకీయ చతురత కలిగిన వ్యక్తి శ్రీధర్ బాబు 1999 నుండి 2014 వరకు వరుసగా 3 సార్లు గెలుపొందారు.   నియోజకవర్గం లోనే కాకా రాష్ట్రంలోనూ అయన కాంగ్రెస్  ఐకాన్ గా  ఉన్నారు . అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చిన శ్రీధర్ బాబు వాళ్ళ నానా  శ్రీపాద రావ్ చెప్పిన మాట, పదవి ,అధికారం ఉన్నప్పుడు పది మందికి మంచి చేయాలని నమ్మి  దానిని ఆచరణలో పెట్టి వరుసగా 3 సార్లు గెలుపొందారు.  అన్నా అని వచ్చిన ప్రతి ఒక్కరికి అండగా నిలిచి సమస్యలను పరిష్కరించారు,2014 లోతెరాస గాలిలో అయన ఓడిపోయినప్పటికీ అందరిలా నియోజకవర్గానికి దూరంగా ఉండకుండా నియోజకవర్గం లో ఉంటూ ప్రజా సమస్యలపై తనదయిన పంథాలో పోరాటాలు చేస్తున్నారు ,మాజీ మంత్రి గా ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతున్నారు ,ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి ని ఎప్పటికప్పుడు బయట పెట్టడడంలో  ప్రజల్లోకి దాన్ని తీసుకు పోవడంలో శ్రీధర్ బాబు  ముందుండడంతో ఎమ్మెల్యే కుటిలంగా శ్రీధర్ బాబును కేసులో ఇరికించడానికి ప్రయత్నించినట్టు ఆరోపణలు ఉన్నాయి . 
2019 elections in Manthani
 
తొలిసారిగా గెలిచిన ఎమ్మెల్యే పుట్ట మధు నియోజకవర్గంలో చాల వివాదాస్పదం గా ఉన్నారు.  అభివృద్ధి అంతంత మాత్రమే ఉంది డబుల్ బెదురూమ్ ఇల్లు పునాదులవద్దే ఆగిపోయాయి ,మిషన్ కాకతీయలో అక్రమాలు జరిగాయని ప్రజలు చెబుతున్నారు ,దలిత యువకుడు మధుకర్ హత్యపై ఎమ్మెల్యే ఫై  ఆరోపణలు ఉన్నాయి ,సింగరేణి నిర్వాసితులకు  న్యాయం చేయలేరని ఆరోపణలు ఉన్నాయి ,ఎమ్మెల్యే అనుచరులు మట్టిని కూడా అమ్ముకున్నారని ఆరోపణలు ఉన్నాయి ,జె ఎన్ టి  యూ  లోను ఎమ్మెల్యే రాజకీయాలు చేస్తున్నారు అని చాలామంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలిగించి తన కార్యకర్తలను అనుచరులను పెట్టుకున్నారని సమాచారం ,ఉద్యోగుల ఫై  దురుసుగా మాట్లాడతారని ఆరోపణలు ఉన్నాయి . కాళేశ్వర -ముక్తేశ్వర ఆలయ అభివృధి చేయడం లో ఎమ్మెల్యే విఫలం అయ్యారు అని ఆరోపణలు ఉన్నాయి.  కాగా అధికారం లో లేనప్పటికీ కాంగ్రెస్ క్యాడర్ చెక్కు చెదరక పోవడంతో ప్రజలు శ్రీధర్ బాబు వైపు ముగ్గు చూపుతున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు . 
మాజీ టీడీపీ ఎమ్మెల్యే కొడుకు సునీల్ రెడ్డి కూడా ఎన్నికల్లో రంగంలోకి దిగడానికి సిద్దపడుతున్నట్టు తెలుస్తుంది . బీజేపీ ఇప్పటి వరకు ఈ  నియోజిక వర్గంలో పోటీచేయలేదు ,దీనితో ప్రత్యామ్నాయం గా ప్రజలకు కాంగ్రెస్ ఒక్కటే అని వచ్చే ఎన్నికల్లో మంథని లో  పాగా వేసేది కాంగ్రెస్ నా  తెరాసనా   చూడాలి .