who is bayyuji last meeting

భయ్యుజి మహారాజ్ చివరగా కలిసి మాట్లాడిన ఆమె ఎవరు?

23

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు భయ్యుజి మహారాజ్ నిన్న తన తుపాకీతో కాల్చుకొని మరణించారు. మరణించడానికి ముందు చివరగా ఆయన ప్రజల్లో కనిపించింది ఒక రెస్టారెంట్ లో. ఇండోర్ లోని ఒక రెస్టారెంట్ లో చివరగా మహారాజ్ కనిపించారు, అరగంటకు పైగా ఆ రెస్టారెంట్ లో గడిపారు. మహారాజ్ ని కలవడానికి ఒక మహిళ, ఒక వ్యక్తి తో పాటు వచ్చింది, అరగంటకు పైగా భయ్యుజి మహారాజ్ తో మాట్లాడారు. ఇంతకు వారెవరు ఏమి మాట్లాడారు, వీరంతా మాట్లాడిన దృశ్యాలు దృశ్యాలు రెస్టారెంట్లోని సీసీటీవీ ఫుటేజి లో నమోదు అయ్యాయి. వీటిని కూడా పరిగణలోకి తీసుకొని ప్రస్తుతం మహారాజ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆయన మొదటి భార్య 2015 లో మరణించింది, తర్వాత భయ్యుజి డా. ఆయుషి శర్మను వివాహం చేసుకున్నారు, ఆ సమయంలో ఒక మహిళ భయ్యుజి తనను మోసం చేసారంటూ ఆరోపణలు గుప్పించారు.

ఎవరో ఒకరు తన కుటుంబ బాధ్యతలు చెప్పట్టాలని తీవ్ర వొత్తిడి వల్లనే నేను వెళ్లిపోతున్నా అని భయ్యుజి సూసైడ్ నోటు రాశారు. అందరికి ఒత్తిడులను అధిగమించడానికి ప్రశాంతం గా ఉండడానికి ఆధ్యాత్మిక బోధనలు చేసే మహారాజ్ ని సహితం తీవ్ర ఒత్తిడికి గురిచేసిన ఆ అంశం ఏమిటి? ఇది అందరి మదిలో కదులుతున్న ప్రశ్న, దీనికి సమాధానం కోసం పోలీసు లు అన్ని విధాలా దర్యాప్తు సాగిస్తున్నారు.