telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ స్టార్ హీరో స్వలింగ సంపర్కుడా… ఆయన తల్లి ఏమందంటే ?

Sanjay

బాలీవుడ్ ప్రేక్షకులు సంజూ భాయ్ గా, రాఖీగా పిలుచుకునే స్టార్ హీరో సంజయ్ దత్ కు సంబంధించిన చాలా విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి. “సంజూ” బయోపిక్ ద్వారా సంజయ్ దత్ కు సంబంధించిన ఎన్నో విషయాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయినా ఆయనకు సంబంధించి ప్రేక్షకులకు తెలీని ఎన్నో విషయాలు రహస్యాలుగానే మిగిలిపోయాయి. సంజయ్ దత్ తన తల్లి నర్గిస్‌తో చాలా సన్నిహితంగా ఉండేవాడు. అనేక కమర్షియల్ చిత్రాలలో పనిచేసింది. ఈమె విజయంతమైన సినిమా మదర్ ఇండియా (1957), అకాడమీ అవార్డుకు నామినేట్ చేయబడింది. ఈ చిత్రంలో తనకు ఫిలింఫేర్ ఉత్తమనటి అవార్డు లభించింది. 1958 లో నర్గిస్ పెళ్ళి సునీల్ దత్ తో జరిగింది. 1967లో నటించిన రాత్ ఔర్ దిన్లో ఈమెకు జాతీయ ఉత్తమనటి అవార్డు లభించింది. అలాంటి నటి తన ముగ్గురు పిల్లలను పెంచుకోవటానికి సినీ వృత్తిని వదులుకుంది. అయితే వారికి సంజయ్ మొదటి సంతానం కావడంతో ఆయనను చాలా గారాబంగా చూసేవారు. సంజయ్ సోదరీమణులు సోదరీమణులు ప్రియా, నమ్రతా… అందరిలోనూ సంజయ్ ను అల్లారుముద్దుగా పెంచారు. అయితే బాలీవుడ్ అరంగేట్రం చేయడానికి మూడు రోజుల ముందు సంజయ్ తన తల్లిని కోల్పోయాడు. క్యాన్సర్‌తో తల్లి మరణించిందని తెలిసినప్పుడు ఆయన వయసు కేవలం 22 సంవత్సరాలు.

 

View this post on Instagram

 

The pillars of our family! I miss you Mom & Dad ♥️

A post shared by Sanjay Dutt (@duttsanjay) on

యాసర్ ఉస్మాన్ రాసిన “సంజయ్ దత్ : ది క్రేజీ అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ బాలీవుడ్ బాడ్ బాయ్” అనే బుక్ లో సంజయ్ సోదరి నమ్రతా చెప్పినదాని ప్రకారం… సంజయ్ బాల్యంలో అతనితో కఠినంగా ఉండటానికి ప్రయత్నించారట తల్లి నర్గిస్. “అమ్మకు కొన్నిసార్లు సంజయ్‌పై కోపం వచ్చేది. ఆమె అతనిపై చెప్పులు కూడా విసిరింది” అని చెప్పుకొచ్చారు నమ్రత. తల్లి మరణించే సమయానికి సంజయ్ మాదకద్రవ్యాలకు వ్యసనుడయ్యాడు. కానీ ఆమె మరణం అతన్ని మరింతగా కృంగదీసింది. నర్గిస్ తన కొడుకుకు మాదకద్రవ్య వ్యసనం ఉందనే విషయాన్నీ అంగీకరించడానికి నిరాకరించింది. అంతేకాదు కొన్ని సమయాల్లో ఆ విషయాన్ని కప్పిపుచ్చింది కూడా. సంజయ్ పై ఆయన తల్లి గుడ్డి నమ్మకాన్ని పెంచుకున్నారు. సంజయ్ గురించి శ్రేయోభిలాషులు నర్గిస్‌తో మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు కూడా ఆమె ‘నా కొడుకు ఎప్పుడూ తాగడు, ఎప్పుడూ డ్రగ్స్ తాకడు’ అనే చెప్పేవారట.

“సంజయ్ అతని స్నేహితులతో ఉన్నప్పుడు ఎప్పుడూ లాక్ చేస్తాడు… ఎందుకు…? అతను స్వలింగ సంపర్కుడు కాదనే నేను అనుకుంటున్నాను” అంటూ తల్లి నర్గిస్ ఒకసారి స్నేహితుడితో మాట్లాడుతుండగా విన్నానని ఈ పుస్తకంలో సంజయ్ సోదరి ప్రియా దత్‌ చెప్పుకొచ్చారు.

తల్లి మరణించిన రెండు సంవత్సరాల తరువాత ఆమె చివరి సందేశాన్ని విన్నాడు సంజయ్. న్యూయార్క్‌లోని ఒక ఆసుపత్రిలో ఆమె డెత్‌బెడ్ వద్ద రికార్డ్ చేసిన ఆడియోలో నర్గిస్ మాట్లాడుతూ “సంజూ అందరితో వినయంగా ఉండు. ఎప్పుడూ గర్వం ప్రదర్శించొద్దు. ఎల్లప్పుడూ పెద్దలను గౌరవించు… అది నిన్ను చాలా దూరం తీసుకెళ్తుంది. అంతేకాదు నీ పనిలో అదే నీకు బలాన్ని ఇస్తుంది” అని చెప్పారు. అది విన్న తరువాత సంజయ్ ఏడుపును ఆపుకోలేకపోయారట. ఈ ఆడియో అతన్ని మనిషిగా మార్చింది.

సంజయ్ ఒకసారి ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “నా తల్లి నన్ను పెంచినంత గారాబంగా… నా భార్య నా పిల్లలను పెంచదనే అనుకుంటున్నాను. పిల్లలు పెరిగేటప్పుడు తల్లిదండ్రులను ద్వేషించకపోతే, వారు పెంచే విధానంలో ఏదో తప్పు ఉందని నా భార్య నాకు చెబుతుంది. నేను నా పిల్లలతో కఠినంగా ఉండాల్సిన సమయంలో అలాగే ఉంటాను” అని సంజయ్ చెప్పుకొచ్చారు. మొత్తానికి పిల్లలను అతి గారాబంగా పెంచడం అనేది వారిని అసమర్థులుగా మారుస్తుందనేది అందరూ అంగీకరించాల్సిన వాస్తవం.

Related posts