telugu navyamedia
ట్రెండింగ్ సాంకేతిక

కొన్ని వర్సన్ ఫోన్లకు .. ఇక వాట్సాప్ కట్..

mail provided by dot for whatsapp affected

వాట్సాప్ సేవలను ఆండ్రాయిడ్‌ 2.3.7 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఓఎస్‌)తో పాటు ఐవోఎస్‌ 7 వాడే ఐఫోన్లకు నిలిపివేస్తున్నట్టు మెసేజింగ్‌ దిగ్గజం వాట్సాప్‌ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ తో నడిచే స్మార్ట్ ఫోన్లకు 2020, ఫిబ్రవరి 1 నుంచి సేవలు ఆగుతాయని తెలిపింది. ఈ ఫోన్లలో కొత్త అకౌంట్లను తెరవలేరనీ, పాత అకౌంట్లను యాక్సెస్‌ చేయలేరని స్పష్టం చేసింది.

డిసెంబర్ 31 తరువాత విండోస్ ఆపరేటింగ్ ఉన్న యూజర్లకు యాక్సెస్ ఉండబోదని పేర్కొంది. జూలై 1 నుంచే మైక్రోసాఫ్ట్‌ స్టోర్‌ నుంచి వాట్సాప్‌ ను తొలగిస్తున్నట్టు వెల్లడించింది. స్మార్ట్ ఫోన్ యూజర్లు ఆండ్రాయిడ్‌ 4.0.3, ఐఓఎస్‌ 8 కన్నా అప్‌ డేటెడ్‌ వెర్షన్లు వాడాలని తెలిపింది. ఆండ్రాయిడ్ల ఫోన్ల కోసం సరికొత్త బీటా వెర్షన్‌ ను అందుబాటులో ఉంచామని, దీనిలో చాటింగ్‌ చేస్తూనే వీడియోలను చూడవచ్చని సంస్థ వెల్లడించింది.

Related posts