telugu navyamedia
సాంకేతిక

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్

ప్రముఖ సోషల్‌ మెసేజింగ్‌ వాట్సాప్‌ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో సరికొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసురానుంది. గతంలో ప్రవేశపెట్టిన ప్రైవసీ సెట్టింగ్‌ను తిరిగి యూజర్లకు అందుబాటులో తీసుకు రానుంది. చివరిసారిగా మీరు వాట్సాప్‌ను ఏ సమయంలో ఉపయోగించారో చూపించే లాస్ట్‌సీన్‌ సెట్టింగ్‌లో అప్‌డేట్‌ను తీసుకురానుంది. ఈ ఫీచర్ ద్వారా మీ వాట్సాప్ కాంటాక్ట్స్‌లో ఎవరినైనా మీ లాస్ట్ సీన్ టైమ్ చూడకుండా హైడ్ చేయవచ్చు.

దీనికోసం ప్రైవసీ సెట్టింగ్లో ఇప్పటివరకు నో బడీ, ఎవ్రీవన్, మై కాంటాక్ట్స్ అనే ఆప్షన్లు కనిపించేవి. అయితే వాట్సాప్ ఇప్పుడు ఈ మూడింటితో పాటు ‘మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్’ అనే ఆప్షన్‌ను కూడా జోడించనుంది. ప్రస్తుతం బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చిన ఈ సెట్టింగ్ త్వరలోనే యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది. ఈ ఆప్షన్ ద్వారా మీరు ఎంచుకున్న యూజర్‌కు మీ లాస్ట్ సీన్ కన్పించదు. మీరు చివరగా ఎప్పుడు వాట్సాప్ ఉపయోగించారో వారు తెలుసుకోలేరు.

Related posts