what is the future of news channels

భవిష్యత్తులో ప్రాంతీయ మీడియా పరిస్థితులు ఏమిటి ?

35

రానున్న రోజుల్లో ప్రాంతీయ మీడియాకు గడ్డు కాలం రాబోతోందా? దేన్ని అయినా శాసించే మీడియాకు మనుగడ కరువుకాబోతుందా, సోషల్ మీడియా విప్లవంతో ఎలక్ట్రానిక్ మీడియాకు ఈ పరిస్థితి దాపరించబోతుందని విశ్లేషకుల అంచనా. అనునిత్యం ప్రపంచంలో జరిగే ఎన్నో సంఘటనలకు కళ్ళకు కట్టినట్టు మనమందు ఉంచే ప్రసార మాధ్యమం మీడియా, అన్యాయాన్ని ఎదురిస్తాం, అక్రమాలను రూపుమాపుతాం, మీకు అండగా మేముంటాం, ప్రతిక్షణం ప్రజాహితం, మీవెంటే మేము అనే దృశ్యరూప ప్రసార మాద్యమాలైన ప్రాంతీయ వార్త చానళ్లకు ఎందుకు భవిష్యత్తులో కాలం చెల్లబోతుందనుకుంటున్నారు ప్రజలు.

సోషల్ మీడియా కొత్త పుంతలు తొక్కుతుంది, ఒక్కపుడు టెక్స్ట్ చాట్ కు మన సందేశాలను వాక్యరూపంలో చెప్పడానికి ఉపయోగపడే ఈ సాధనం ప్రతి సామాన్యునికి ఒక టెలివిజన్ గా మారింది, ఒకప్పుడు మనిషి తన సందేశాన్ని, సమస్యను దృశ్య రూపం లో పంచుకోవాలంటే టీవీ ఛానెళ్ల ద్వారా మాత్రమే చెప్పే సౌకర్యం ఉండేది, దీనితో టీవీ వార్త ఛానల్ అంటే అందరికి చాలా క్రేజ్ ఉండేది. సామాన్యులు ఛానెల్ లో రావడం, కనిపించడం చాలా గొప్పగా ఫీల్ అయ్యేవారు. అటువంటిది ఇప్పుడు పరిస్థితి మారింది అనేక ఛానళ్ళు పుట్టుకొచ్చాయి, ఒకప్పుడు టీవీ ఛానల్ లో పనిచేస్తున్న వారంటే సమాజంలో ఎంతో గౌరవం, మర్యాద ఉండేది, కానీ పెరుగుతున్న ఛానెళ్ల వల్ల అది కాస్త తాగ్గుతూ వచ్చింది. అంతేకాదు ఛానల్ లు తక్కువగా ఉన్నపుడు ప్రజల్లో వార్త యొక్క ప్రామాణిక స్థాయి హెచ్చుగా ఉండేది, కానీ రాను రాను ఒకవిషయాన్ని పది ఛానెల్ లు పది విధాలుగా చెప్పడంతో వార్తలు పలచబడ్డాయి. దీనితో జనం లో విశ్వసనీయత ఛానెళ్లపై కొరవడింది.

దీనికి తోడు అప్పుడప్పుడే పుట్టుకొచ్చిన సామజిక ప్రసార మాధ్యమాలు జనాలకు ఊతమిచ్చాయి ,ప్రతిసామాన్యునికి సోషల్ మీడియా ఒక ఆయుధం గా మారింది ,ఎవరి సందేశాలను వల్లే రికార్డు చేసుకొని ఫేస్బుక్ ,యూట్యూబ్ వంటి సామాజిక ప్రసార మాధ్యమాల్లో పెడుతూ ప్రపంచానికి పరిచయం అవుతున్నారు . ఈ సోషల్ మీడియా విప్లవంతో ప్రాంతీయంగా ఐతే టీవీ వార్త ఛానెళ్ల పని ఇగ ముగియపోతుందని విశ్లేషకులు అంటున్నారు.ఒక్కప్పుడు వీటిలో పనిచేయడానికి నాతో ఆసక్తి చూపిన ఉద్యోగులు ఇప్పుడు వద్దురా మీడియా అంటున్నారు .

ఇంతటి మార్పు సంతరించుకున్న తరుణంలో రాబోయే రోజుల్లో మీడియా పరిస్థితి ప్రశ్నార్థకమే ?

-సంతోష్ కుమార్