telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

నడకతో… హృద్రోగాలకు చెక్ .. !

walking helps to overcome heart diseases

రోజు కాసేపు శరీరానికి నడక అలవాటు చేయడం వ‌ల్ల ఎన్ని ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. నడక వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గుతారు. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. మ‌ధుమేహం అదుపులో ఉంటుంది. ఇంకా ఎన్నో లాభాలు నడక వ‌ల్ల మ‌న‌కు కలుగుతున్నాయని నిపుణులు ప్రస్తావించారు. అయితే నిత్యం నడక చేయ‌డం వ‌ల్ల హార్ట్ ఎటాక్‌లు, క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డైంది.

85 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న 88వేల మందిని ప‌లువురు సైంటిస్టులు కొన్నేళ్ల పాటు ప‌రిశీలించారు. వారు నిత్యం చేసే వ్యాయామాలు, వారికి ఉన్న వ్యాధులు త‌దిత‌ర వివ‌రాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు సేక‌రించారు. దీనితో చివ‌రికి తేలిందేమిటంటే… వారంలో క‌నీసం 10 నుంచి 59 నిమిషాల పాటు నడక లేదా తోట‌ప‌ని చేసిన వారికి హార్ట్ ఎటాక్స్ వ‌చ్చే అవ‌కాశాలు 18 శాతం వ‌ర‌కు త‌గ్గాయ‌ని తేల్చారు.

kale and its health benefitsaఅస‌లు ఎలాంటి శారీర‌క శ్ర‌మ చేయ‌ని వారితో పోలిస్తే వారంలో ఎంతో కొంత వ్యాయామం లేదా శారీర‌క శ్ర‌మ చేసే వారు మిక్కిలి ఆరోగ్యంగా ఉన్నార‌ని సైంటిస్టులు గుర్తించారు. అందువ‌ల్ల నిత్యం నడక లేదా తోట‌పని, ఇంటి ప‌ని వంటివి చేస్తే.. ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చ‌ని, గుండె జ‌బ్బులు, క్యాన్సర్ రాకుండా ఉంటాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

Related posts