manchu-lakshmi

“వైఫ్ అఫ్ రామ్” ట్రైలర్ వచ్చేసింది

21

మంచు ఎంటర్టైన్మెంట్స్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై విజయ్ ఎలకంటి దర్శకత్వంలో మంచు లక్ష్మీ కీలకపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం “వైఫ్ అఫ్ రామ్”. టిజి విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రఘు దీక్షిత్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు చిత్రబృందం.

ఈరోజు ఉదయం 11 గంటలకు “వైఫ్ అఫ్ రామ్” ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే చిత్రంలో లక్ష్మీ తన భర్త కోసం డిటెక్టీవ్ లా పనిచేస్తుందని తెలుస్తోంది. మొత్తానికి సస్పెన్సు, యాక్షన్ థ్రిల్లర్ గా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోందని అర్థమవుతోంది.

2015లో వచ్చిన దొంగాట తరువాత మంచు లక్ష్మి నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. ఈ చిత్రంలో ఆదర్శ్ బాలకృష్ణ , శ్రీకాంత్ అయ్యర్ , సామ్రాట్ రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ ఇంతకుముందు రాజమౌళి దగ్గర పని చేశారు. ఈ చిత్రాన్ని జూన్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.