ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి నమూనాను నమ్మి ఢిల్లీలోని ప్రజలు తమ పార్టీని ఆశీర్వదించారని, మాజీ సీఎం కేజ్రీవాల్ అవినీతిని ప్రజలు బయటపెట్టారని మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు.
ఢిల్లీలో బీజేపీ విజయంపై ఆమె ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ఆమె అన్నారు.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పంట రుణాల మాఫీ, రైతు భరోసా పథకాలను అమలు చేయడంలో విఫలమైందని డీకే అరుణ విమర్శించారు.
రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు హామీలను అటకెక్కించారని ఆమె ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల పేర్లు మార్చకుంటే కేంద్రం నిధులు ఇవ్వదని ఆమె అన్నారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో ప్రధానమంత్రి ఫోటో లేకుంటే నిధులు ఎందుకు ఇస్తారని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వం ఎలాంటి పథకాలు అమలు చేయడం లేదని, స్థానిక సంస్థల ఎన్నికలను హడావుడిగా నిర్వహిస్తోందని ఆమె ఆరోపించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తేనే ఇచ్చిన హామీలు అమలు అవుతాయని అరుణ అభిప్రాయపడ్డారు. ఏడాది గడిచినా రాష్ట్రంలో పాలన పూర్తి స్థాయిలో జరగలేదని ఆమె ఆరోపించారు.
ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుంటే కేసీఆర్, కేజ్రీవాల్‌ల గతే రేవంత్‌రెడ్డికి కూడా తప్పదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’’ అంటూ బీజేపీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయబోతున్నాయని డీకే అరుణ అన్నారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అవినీతి సామ్రాజ్యం కూలిపోయింది మార్పు కోసం ఢిల్లీ ప్రజలు బీజేపీకి మద్దతిచ్చారని ఆమె పేర్కొన్నారు.
దాడులు చేయడం ఈ ప్రభుత్వానికి అటవాటే: గోరంట్ల