BREAKING NEWS:
Vote in the Panchayat Elections

పంచాయతీ  ఎన్నికల్లో జనం ఓటు ప్రతిపక్షానికా – అధికార పక్షానికా ? 

33
గ్రామాల్లో సందడి నెలకొనబోతుంది,  మన  మూడంచెల రాజకీయ వ్యవస్థలో ముఖ్యమైన, ప్రథమమైన పంచాయతీ ఎన్నికలు వచ్చే నెల చివర్లో రానున్నాయి. రాష్ట్రంలో అన్ని  పార్టీ లు ఈ ఎన్నికలకు  కసరత్తు ప్రారంభించాయి. ఎలాగైనా తమ అభ్యర్ధులను గెలిపించుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నాయి. మన రాష్ట్రము లో మొత్తం 8684 పంచాయతీలు ఉండగా కొత్తగా జనాభా ప్రాతిపదికన 4000 గ్రామా పంచాయతీలను ఏర్పరచింది ప్రభుత్వం, దేశానికి పల్లెలే పట్టు కొమ్మలు, మార్పు రాజకీయానికి  ఇక్కడి నుండే ప్రారంభం అవుతుంది. రాజకీయాల్లో సెకండ్ క్యాడర్ గా చెప్పుకునేవారు వీటిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం జులై  చివరి వరం లో ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమవుతుంది. 
 
గ్రామాల్లో ఎన్నికలంటే హడావిడే,  నిజానికి  చిన్నపాటి గ్రామవ్యవస్థలో గ్రా ప్రథమ పౌరుడు (సర్పంచ్ ) కావాలనే కల  చాలా మంది పార్టీ కార్యకర్తలకి ఉంటుంది, కానీ తమ గ్రామం రిజర్వు చేయబడిన కాటగిరిని బట్టి ఆయా వ్యక్తులు రంగంలోకి దిగుతారు, ఈ  చిన్న ఎన్నికలకు కూడా కొన్ని పంచాయతీలో కోట్ల రూపాయలు ఖర్చుచేస్తుంటారు, కాగా కొన్ని పంచాయతీలు మాత్రం పార్టీలను సహితం పక్కకు పెట్టి గ్రామా అభివృద్ది కోసం  ఏకగ్రీవం చేస్తారు, ఒకవేళ  ఆ గ్రామ పంచాయతీ పరిధిలో పరిశ్రమలు కనుక ఉంటే మాత్రం ఈ ఎన్నికల్లో డబ్బులు ఏరులై పారాల్సిందే. ప్రభుత్వం ఇటువంటి వాటిని అరికట్టి ఎలక్షన్ ఏకగ్రీవం చేసే  పంచాయతీలకు ప్రోత్సాహకాలను ప్రకటించింది, ఆ గ్రామా జనాభా ప్రాతిపదికన చిన్న పంచాయతీలకు 5,00,000 పెద్ద పంచాయతీలకు 10,00,000 వరకు ఇవ్వనుంది ప్రభుత్వం అంతేకాకుండా గ్రామీణ అభివృది  క్రింద 2,000 కోట్లు పంచాయతీల కొరకు బడ్జెట్ లో పెట్టనుననట్టు గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పారు. 
 
అసలు గ్రామాల్లో ఈ పంచాయతీ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి, ప్రజలు ఏ  పార్టీ కి పట్టం కట్టబోతున్నారు, తెలంగాలో ముఖ్యం గా 3 పార్టీలు తెలంగాణ గ్రామాల్లో బలంగా  ఉన్నాయి.  తెరాస, కాంగ్రెస్, బీజేపీ కాగా ఇప్పుడు ప్రొఫెసర్ కోదండ రామ్ పెట్టిన తెలంగాణ జన సమితి.   ప్రతి గ్రామంలో పోటీ చేయడానికి సిద్ధం అవుతుంది, గ్రామాల్లో అంతగా కార్యకర్తలు కానీ బలం కానీ లేని ఈ పార్టీ ఈ ఎన్నికల ద్వారానే  తన బలాన్ని పెంచుకోవాలని చూస్తుంది. ఇందుకోసం సభ్యత్వాలను సర్పంచు గా పోటీ చేయాలనుకునేవారు ఆన్ లైన్ లో రిజిస్టర్ కావాలని ప్రచారం చేస్తుంది, ఈ పార్టీ అధ్యక్షుడు కోదండరాం వస్తున్న ఈ ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యం  ఇస్తున్నారు. సామజిక మాధ్యమాల్లో కూడా యువతీ యువకులు  ఎన్నికల్లో బరిలోకి దిగడానికి తమ పేరు రిజిస్టర్ చేసుకోవాలని పోస్టులు పెడుతున్నారు, దీనిని బట్టి చూస్తే  కేవలం తమ బలం పెంచుకోవడానికి మాత్రమే  కోదండరాం ఈ పంచాయతీ ఎన్నికలను వాడుకోనున్నట్టు తెలుస్తుంది. 
        
ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లో  ఎక్కువగా గ్రామాల్లో డబ్బు ప్రభావం చూపుతుంది. ఈ  విషయం బాగా తెలిసిన కోదండరాం  తమ పార్టీ బలం పెంచడానికి యువతకు అవకాశం ఇస్తున్నారు అని  తెలుస్తుంది.
 
గ్రామాల్లో  కాంగ్రెస్,  బీజేపీ, తెరాస, టీజెస్  ఈ  పార్టీ అభ్యర్థులే కాకుండా  ఇండిపెండెంట్ అభ్యర్థులు సహితం పంచాయతీ ఎన్నికల్లో ప్రభావం చూపుతారు, పార్టీ లు 50% ప్రభావం చూపితే ఇంకా 50%అభ్యర్థి ని బట్టి సామాజికవర్గాన్ని పట్టి ఓట్లు వేస్తారు, గ్రామాల్లో కొన్ని సామజిక వర్గాలు కొన్ని సంవత్సరాల నుండి కాంగ్రెస్ కు అనుకూలం గా ఉన్నాయి కాగా ప్రభుత్వ పథకాలు కూడా ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. 
 
అయితే ప్రస్తుతం గ్రామాల్లో ప్రజలు ప్రభుత్వ పథకాలపై అంతగా సంతృప్తితో లేరని విశ్లేషకుల మాట.  ఎంతో మంచి ఉదేశ్యం తో ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ అవి గ్రామా స్థాయిలో పక్కదారి పట్టాయని ప్రజలు అంటున్నారు, నిజమైన లబ్ది దారులకు కాకుండా పార్టీ కార్యకర్తలకు, పార్టీ నాయకులకే లబ్ది చేకూర్చాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన యంత్ర లక్ష్మి ప్రజల్లో ప్రభుత్వం పట్ల చాలా వరకు అసంతృప్తిని నింపింది, నిజమైన రైతులకు కాకుండా ట్రాక్టర్లు కానీ వరికోత మిషన్ లు గాని పార్టీ నాయకులకు ఇచ్చారు. అంతేకాకుండా బోరు వేసుకుంటే వ్యవసాయ బోర్ సక్సెస్ అయితే  ప్రభుత్వం ఆ వ్యవసాయ దారుడికి 1,00,000 రూపాయలను అందించే పథకం పెట్టింది, ఐతే ఇందులోనూ తెరాస ఎమ్మెల్యే లు కమీషన్లు తీసుకోవడంతో రైతులు తెరాస పట్ల అసంతృప్తితో వున్నారు, మొన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం  రైతులకు లబ్ది చేకూరినప్పటికీ  పేద కౌలు రైతులను నిరాశపరిచింది, రైతుల్లో కౌలు రైతులు మన రాష్ట్రంలో సుమారు 70%  ఉన్నారు. ఇక తరువాత ప్రభావం చూపే యువకులు  నిరుద్యోగం వల్ల  ప్రభుత్వం అన్న విధంగా నోటిఫికెషన్స్ వేయకపోవడంతో వీరుకూడా ప్రభుత్వానికి తెరాస కు వ్యతిరేకంగా ఉన్నారు.  ఇలా  ఇందులో చుసిన  ప్రజలకు ప్రభుత్వం తెరాస పాలనపై  ప్రతికూలం గా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు, కానీ గ్రామా పంచాయతీ ఎన్నికల్లో డబ్బు మరియు అధికారం కూడా ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. 
 
ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ క్యాడర్ గ్రామాల్లో బలంగా ఉన్నప్పటికీ అవి ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాలను తీసుకుపోవడం వల్ల  మాత్రమే అవి ఎక్కువ పంచాయతీ స్థానాల్లో గెలిచే అవకాశం  ఉంటుంది. వీటన్నింటిని  ఆలోచించే ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో ఎ పార్టీ కి పట్టం కడతారో చూడాలి. గ్రామాల్లోని ఈ  ప్రజల పంచాయతీ తీర్పు ప్రభావం శాసనసభ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపొచ్చు.