అతివేగం ప్రమాదం అని ఎంతగా చెపుతున్నా ఫలితం మాత్రం సూన్యంగానే కనిపిస్తుంది. రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతూనే జరుగుతూనే ఉన్నాయి..తాజాగా, ఆగి ఉన్న లారీని, వోల్వో బస్సు వెనుక నుంచి ఢీకొట్టిన ప్రమాదంలో పది మందికి గాయాలు కాగా వీరిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని సి.మల్లవరం వద్ద జరిగిన ఈరోడ్డు ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి.
నాయుడు పేట నుంచి బెంగళూరుకు గాజు గ్లాసు లోడుతో వెళ్తున్న లారీని డ్రైవర్ సి.మల్లవరం వద్ద రోడ్డుపక్కన నిలిపాడు. అదే రోడ్డులో వెనుక నుంచి వస్తున్న ఓ వోల్వో బస్సు లారిని బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగంలోకి చాలా వరకు లారీ వెనుక భాగం చొచ్చుకుపోయింది. ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికుల్లో పది మంది గాయపడగా వీరిలో డ్రైవర్, మరో ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.
అసభ్యంగా తాకేవాళ్ళు ఎక్కువవుతున్నారు… ఆ తేడాగాళ్లను ముందే పసిగట్టాలి : రకుల్