ఏపీ రాజధాని వ్యవహారంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. దీనిపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించారు. విశాఖలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, అందుకనే అక్కడ రాజధానికి ప్రభుత్వం మొగ్గు చూపుతోందని ఆరోపించారు. గత ఆర్నెల్ల కాలంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖపట్నంలో ఎవరెవర్ని కలిశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
మధురవాడ, భోగాపురం ప్రాంతాల్లో ఇప్పటికే 6,000 ఎకరాలు వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లాయని తెలిపారు.ఈ రోజు విశాఖపట్నం సహా మూడు రాజధానులు అంటున్న సీఎం జగన్ నాడు విపక్షనేతగా ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా అంగీకరించలేదా? అని ప్రశ్నించారు.