vitamin c cures sepsis

‘సెప్సిస్’ కు విటమిన్ ‘సి’ నే సమాధానం…

99

విటమిన్ సి శరీరంలో తగినంత ఉండటం ఎంత ముఖ్యమో మరోసారి రుజువైంది. న్యూజీలాండ్ లో సెప్సిస్ వల్ల మృతులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో అక్కడి వైద్యులు ఈ పరిస్థితిపై పరిశోధన గావించారు. ఈ పరిశోధనలో సి విటమిన్ సరైన విధంగా ఉంటె ఇటువంటి అనేక సమస్యలనుండి బయటపడొచ్చని నిరూపించారు.

సెప్సిస్ వల్ల ఐసీయూ లోనె అనేకమంది మృతి చెందుతున్నారు. ఒక్కసారి సెప్సిస్ బారిన పడితే రోగనిరోధక శక్తి అతివేగంగా పడిపోవటం సంభవించి మృతి చెందే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. మొదట చిన్న జ్వరంతో ప్రారంభమైనా…తరువాతి దశలో హృదయ స్పందన అతిగా పెరిగిపోవటం, శ్వాస స్థాయిలు కూడా సాధారణంగా కాక అతివేగంగా ఉండటం మరియు స్పష్టత లేకుండా ఉండటం వంటివి ఈ సెప్సిస్ కి ప్రధాన లక్షణాలుగా చెపుతున్నారు.

సెప్సిస్ వస్తే శరీరంలో కణాలు వాటంతట అవే ఇన్ఫెక్షన్ కు గురవటం, నశించిపోవటం ఇవన్నీ శరీరంలో సరైన మోతాదులో విటమిన్ సి లేకపోవటమేనని, అది సరైన పాళ్ళలో రోజువారీ ఆహారంలో చేర్చుకోవటం వల్ల ఇటువంటి వ్యాదుల బారిన పడకుండా రక్షించుకోవచ్చంటున్నారు వైద్యులు.

ఈ మేరకు ఒటాగో మరియు క్రిస్ట్ చర్చి విశ్వవిద్యాలయాల పరిశోధకులు వారి పరిశోధనలో 80 శాతం అనుకూల ఫలితాలు వచ్చాయని స్పష్టం చేశారు. సి విటమిన్ తోపాటు ప్రకృతి ఇచ్చిన ఆహారాన్ని స్వీకరించడం మేలని, రసాయనిక ఎరువులతో పండించే వాటిని వాడకపోతేనే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అసోసియేట్ ప్రొఫెసర్ అనిట్రా కార్ ఇటీవలే క్రిస్ట్ చర్చి ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో తమ పరిశోధనలకు వచ్చిన అనుకూల ఫలితాలను గురించి వెల్లడించారు.

రోజువారీ ఆహారంలో సరైన మోతాదులో విటమిన్లు, మినరల్స్ , ప్రోటీన్ లు వంటివి ఉండేట్టు తీసుకుంటే సరిపోతుంది కానీ డైటింగ్ పేరు చెప్పి ఆహరం తీసుకోకుండా ఉండటం సరైనది కాదని మొదటి నుండి వైద్యులు చెబుతున్నదే.