viswarupam--2

మూడు భాషల్లో… ఈ ముగ్గురు…!?

49

కమల్ హాసన్ హీరోగా, నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం “విశ్వరూపం-2” చిత్రం ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు. జూన్ 11న సాయంత్రం 5 గంటలకు “విశ్వరూపం-2” ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్టు తెలియజేశారు. అయితే ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. కాబట్టి ఒక్కో భాష ట్రైలర్ ను ఆయా భాషల్లోని ప్రముఖ నటుల చేత విడుదల చేస్తున్నారు. హిందీలో “విశ్వరూపం-2” ట్రైలర్ ను అమీర్ ఖాన్ చేత, తెలుగులో “విశ్వరూపం-2” ట్రైలర్ ను ఎన్టీఆర్ చేత, తమిళంలో “విశ్వరూపం-2” ట్రైలర్ ను శృతీ హాసన్ చేత విడుదల చేస్తున్నారు.

కమల్ హాసన్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న”విశ్వరూపం-2″ చిత్రానికి సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది. “విశ్వరూపం” సినిమాకు కొనసాగింపుగా ఈ “విశ్వరూపం-2″ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. విశ్వరూపం కన్నాఇందులో ఎక్కువ యాక్షన్ సీన్స్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ నిర్మించి, దర్శకత్వం వహించడం విశేషం. ఇందులో కమల్ హాసన్ తో పాటు పూజ కుమార్, ఆండ్రియా, రాహుల్ బోస్, శేఖర్ కపూర్, వహీదా రెహమాన్, జైదీప్, అనంత మహదేవన్, రస్సెల్ జాఫ్రీ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం మహమ్మద్ ఘిబ్రాన్ అందిస్తున్నారు.