viswaroopam-2

మూడు భాషల్లో కమల్ విశ్వరూపాన్ని చూశారా ?

13

కమల్ హాసన్ హీరోగా, నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం “విశ్వరూపం-2” చిత్రం ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు. జూన్ 11న సాయంత్రం 5 గంటలకు “విశ్వరూపం-2” ట్రైలర్ ను విడుదల చేశారు. అయితే ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. కాబట్టి ఒక్కో భాష ట్రైలర్ ను ఆయా భాషల్లోని ప్రముఖ నటుల చేత విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.

హిందీలో “విశ్వరూపం-2” ట్రైలర్ ను అమీర్ ఖాన్ చేత, తెలుగులో “విశ్వరూపం-2” ట్రైలర్ ను ఎన్టీఆర్ చేత, తమిళంలో “విశ్వరూపం-2” ట్రైలర్ ను శృతీ హాసన్ చేత విడుదల చేయించారు. ఇప్పుడు ఈ మూడు భాషలకు సంబంధించిన ట్రైలర్లను విడుదల చేశారు.

అయితే ఈ ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే 2.5 మిలియన్ వ్యూస్ ను సంపాదించుకుంది. అంటే దీన్నిబట్టి తెలుస్తోంది. “విశ్వరూపం-2” కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనేది.

కమల్ హాసన్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న”విశ్వరూపం-2″ చిత్రానికి సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది. “విశ్వరూపం” సినిమాకు కొనసాగింపుగా ఈ “విశ్వరూపం-2″ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. విశ్వరూపం కన్నాఇందులో ఎక్కువ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. యాక్షన్ సీన్లే కాదు రొమాంటిక్ సీన్లు కూడా కాస్త ఎక్కువగానే ఉన్నట్టుగా తెలుస్తోంది ట్రైలర్ లో.

ఈ చిత్రాన్ని కమల్ హాసన్ నిర్మించి, దర్శకత్వం వహించడం విశేషం. ఇందులో కమల్ హాసన్ తో పాటు పూజ కుమార్, ఆండ్రియా, రాహుల్ బోస్, శేఖర్ కపూర్, వహీదా రెహమాన్, జైదీప్, అనంత మహదేవన్, రస్సెల్ జాఫ్రీ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం మహమ్మద్ ఘిబ్రాన్ అందిస్తున్నారు.