ఎన్నికలలో ఓడిన లక్ష్మణ సవదికి డీసీఎం పదవి ఇచ్చారని రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు కారకులైన తమకెందుకు మంత్రి హోదా దక్కదని హెచ్.విశ్వనాథ్ పేర్కొన్నారు. మైసూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నాయకుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో గెలిచిన వారికి మంత్రి పదవులు, ఓడిన వారికి లేదనే సాగుతున్న ప్రచారాలపై ఆయన స్పందించారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చాలని భావించామని ఆ విషయంలో తప్పు చేసినట్టు భావించడం లేదన్నారు.
మంత్రి హోదా దక్కినా… దక్కకపోయినా రాజకీయ చివరి అంకంలో ఓడిపోననే నమ్మకం ఉందన్నారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన సందర్భంలో యడియూరప్ప ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారనే విశ్వాసం వ్యక్తం చేశారు. చిక్కబళ్ళాపుర ఎమ్మెల్యే సుధాకర్‌పైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. మేమంతా ఒక నిర్ణయంతో వ్యవహరించామన్నారు.