telugu navyamedia
సినిమా వార్తలు

పాగ‌ల్ ప్రేమ వ‌చ్చేసింది..!

ఈన‌గ‌రానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్ హిట్‌ వంటి చిత్రాలతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న విశ్వక్ సేన్ పూర్తి లవర్ బాయ్ గా తెరకెక్కిన చిత్రం “పాగల్. ఇంతకుముందు సినిమాలతో పోలిస్తే విశ్వక్ సేన్ ఈ సినిమాలో విభిన్నంగా కనిపించాడని చెప్పుకోవాలి. యంగ్, రొమాంటిక్ పాత్రలో విశ్వక్ సేన్ చాలా బాగా నటించాడు. విశ్వక్ సేన్ తన పాత్రలో ఒదిగిపోయి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు.

Nivetha pethuraj paagal movie trailer vishwak sen simran megha lekha | Galatta

నివేతా పేతురాజ్ ఈ సినిమాలో అందంతో మాత్రమే కాక నటనతో కూడా చాలా బాగా ఆకట్టుకుంది. విశ్వక్ సేన్ తో తన కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది. సిమ్రాన్ చౌదరి మరియు మేఘా లేఖ కు కూడా వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. భూమిక చావ్లా కు సినిమాలో కీలక పాత్ర దొరికింది. ఆ పాత్రకు పూర్తి న్యాయం సమకూర్చారు చేశారు భూమిక. హీరోయిన్ తండ్రి పాత్రలో మురళి శర్మ కూడా బాగానే ఆకట్టుకున్నారు. మిగతా నటీనటులు కూడా బాగానే నటించారు.

Paagal' trailer: Vishwak Sen and Nivetha Pethuraj's film promises a fun ride | Telugu Movie News - Times of India

క‌థ విష‌యంలోకి వ‌స్తే ..అమ్మ అంటే అమీతమైన ప్రేమ ఉన్న ప్రేమ్ (విశ్వక్ సేన్), క్యాన్సర్ కారణంగా చిన్నతనంలోనే అమ్మని కోల్పోతాడు. ఎవరినైతే నిజాయితిగా ప్రేమిస్తామో వాళ్లు కూడా మనల్ని నిజాయితిగా ప్రేమిస్తారని తల్లి చెప్పటంతో, అమ్మాయిని ప్రేమిస్తే అమ్మ లాంటి ప్రేమ దొరుకుతుందని భావిస్తాడు.

అలా కనపడ్డ 1600 మంది అమ్మాయిలకి ఐ లవ్ యూ చెప్తూ, నిజమైన ప్రేమను వెతుక్కుంటూ ఉంటాడు ప్రేమ్. కానీ అందులో ఏ ఒక్కరు కూడా అతని ప్రేమను అంగీకరించరు. దీనితో జీవితంపై విసుగు చెందిన ప్రేమ్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే తన జీవితంలోకి తీరా నివేదా పేతురాజ్ వస్తుంది. అప్పటికే నిశ్చితార్థం అయిపోయినప్పటికీ, తీరా ప్రేమ్ కు ప్రపోజ్ చేస్తుంది. చివరికి వీళ్ళిద్దరూ కలిసారా లేదా? వారి కథ ఏమైంది? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

Vishwak Sen and Nivetha Pethuraj's ''Paagal'': First song Saradaga Kasepaina's lyrical video is out | Telugu Movie News - Times of India

ఈ సినిమాతో న‌రేశ్ కుప్పిలి ద‌ర్శ‌కుడిగా పరిచయ్యం అయ్యాడు. ప్రేమ్ క్యారెక్టర్ కు విశ్వక్ సేన్ కరెక్ట్ గా సూట్ అయ్యాడు.. ఫస్టాఫ్ లో హీరో అంతా అమ్మాయిల ఐ ల‌వ్ యూ చెప్తూ వెంట పడటం, అమ్మాయిలు రిజెక్ట్ చేయటం, వంటి సన్నీవేశాలున్నా, మేఘా లేఖ‌, సిమ్రాన్ చౌద‌రిలు, రిజెక్ట్ చేసేపుడు వచ్చే కొన్ని సీన్స్ అందులో కాచ్చే కామెడీ ఎంజాయ్ చేయవచ్చు. మధ్య మధ్యలో కమెడియన్ రాహుల్ రామకృష్ణ గ్యాంగ్ చేసే కామెడీ ఆకట్టుకుంటుంది. అన్ని కలిపి ‘పాగల్’ ఒక రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమా అనిపిస్తుంది.

Related posts