telugu navyamedia
సినిమా వార్తలు

మాది పెద్ద సినిమా కాదు.. గొప్ప సినిమా..

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. గతంలో ‘ఫలక్ నుమా దాస్’, ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి సినిమాలతో పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఇక ఆయన నటించే సినిమాలతో పాటు కాంట్రవర్సీ స్టేట్‌మెంట్‌లతో సైతం నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు విశ్వక్‌. గతంలో ఫలక్‌నుమా దాస్‌ ప్రీరిలీజ్‌ వేడుకల్లో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసి టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారాడు విశ్వక్‌.

Paagal'' teaser: Vishwak Sen promises a perfect family entertainer packed with romance, action | Telugu Movie News - Times of India

తాజాగా ఈ హీరో నటించిన మరో సినిమా ‘పాగల్’. నివేతా పేతురేజ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి నరేష్ కుప్పిలి దర్శకత్వం వహించారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కం వేణుగోపాల్ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ చేసిన సంచ‌ల‌న‌ కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి.

సినిమా పక్కా హిట్ అని.. అవ్వకపోతే పేరు మార్చుకుంటా అంటూ మరోసారి చర్చకు దారి తీశాడు . అలా కాన్ఫిడెంట్ గా విశ్వక్ సేన్ చెప్పడంతో అందరి దృష్టి ‘పాగల్’పై పడింది. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలకు మీరు కట్టుబడి ఉన్నారా.? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ఆ ఈవెంట్లో నేను మాట్లాడిన ఏ మాటనీ వెనక్కి తీసుకోనని చెప్పాడు.

Vishwak Sen and Nivetha Pethuraj's ''Paagal'': First song Saradaga Kasepaina's lyrical video is out | Telugu Movie News - Times of India

మాది పెద్ద సినిమా కాదు కానీ గొప్ప సినిమా అని చెప్పగలను, తనతో పాటు తన స్నేహితులు కూడా చూసి బాగుందని అన్నారని విశ్వక్‌ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాని నమ్ముకుని చాలామంది భవిష్యత్‌ ఉంది. పైగా ప్రేక్షకులకు థియేటర్‌ అనుభూతి ఇవ్వాలనుకున్నాం కాబట్టి ఓటీటీకి వెళ్లకుండా థియేటర్స్‌లో రిలీజ్‌ చేస్తున్నాం.

Related posts