telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఇంగ్లాండ్ లెజెండ‌రీ ఆల్‌రౌండ‌ర్ ఇయాన్ బోథ‌మ్ ప్ర‌శంస‌లు

Virat

భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఇంగ్లాండ్ లెజెండ‌రీ ఆల్‌రౌండ‌ర్ ఇయాన్ బోథ‌మ్ ప్ర‌శంస‌లు కురిపించాడు. 2014 నుంచి భార‌త టెస్టు జ‌ట్టు.. 2017 నుంచి ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్ జ‌ట్టును త‌ను న‌డిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు నుంచి గేమ్‌ను త‌ను లాగేసుకుంటాడ‌ని, ప్లేయ‌ర్ల‌కు అండ‌గా ఎల్ల‌ప్పుడు నిలుస్తాడ‌ని ప్ర‌శంసించాడు. 2008లో అండ‌ర్‌-19 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను కోహ్లీ సార‌థ్యంలోనే టీమిండియా సాధించిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుంచే అత‌నికి నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని గుర్తు చేశాడు. కోహ్లీతో త‌ను పోటీ ప‌డితే బాగుండేద‌ని బోథ‌మ్ వ్యాఖ్యానించాడు. మ‌రోవైపు భారత క్రికెట్‌ను మ‌రింత పై ఎత్తుకు తీసుకెళ్లే స‌రైన వ్యక్తి కోహ్లీయేన‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. మ‌రోవైపు మాజీ క్రికెట‌ర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కంటే మెరుగైన ఆల్‌రౌండ‌ర్ బెన్ స్టోక్స్ అని విశ్లేషించాడు. 2019 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను ఇంగ్లాండ్ సాధించ‌డంలో స్టోక్స్ కీల‌క‌పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఫ్లింటాఫ్‌తో పోలిస్తే స్టోక్స్ ఎన్నో రెట్లు మెరుగ‌ని బోథ‌మ్ వ్యాఖ్యానించాడు. త‌నలాగే స్టోక్స్ ఆడ‌తాడ‌ని గుర్తు చేశాడు. ఫ్రెడ్డీ మెరుగైన బౌల‌ర్ అయిన‌ప్ప‌టికీ, స్టోక్స్ అతనికంటే చాలా విష‌యాల్లో ముందుంటాడ‌ని వ్యాఖ్యానించాడు. మ‌రోవైపు స‌మ‌కాలీన క్రికెట్ ప్ర‌పంచంలోనే ఉత్త‌మ‌ ఆట‌గాడ‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు.

Related posts