telugu navyamedia
క్రీడలు వార్తలు

గూగుల్ లో దానిని తెగ వెతికిన విరాట్ ఫాన్స్..

Virat

టీమిండియా కెప్టెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ నవంబర్ 5 న 32వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా కోహ్లీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత క్రికెటర్లు, మాజీలు, అభిమానులతో పాటు ఫ్రాంచైజీలు సైతం కోహ్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు చేసాయి. భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌కు ట్విట్టర్లో వెల్లువలా శుభాకాంక్షలు వస్తున్నాయి. #HappyBirthdayViratKohili హ్యాష్‌ట్యాగ్‌తో ట్విటర్‌లో మోత మోగుతోంది. అయితే కొంతమంది అభిమానులు మాత్రం సోషల్‌ మీడియా వేదికగా విషెస్‌ చెబితే కిక్కేం ఉంటుందని.. విరాట్ కోహ్లీ ఫోన్‌ నంబర్‌ సంపాదించి పర్సనల్‌గానే విష్‌ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. తమ అభిమాన క్రికెటర్‌ బర్త్‌డేను మరింత ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసుకునేందుకు.. గూగుల్‌ సాయం అడుగుతున్నారు. కోహ్లీ ఫోన్‌ నంబర్ కోసం చాలా మంది గూగుల్‌లో వెతికారు. దీంతో గూగుల్‌ ఇండియా సెర్చ్‌లో కోహ్లీ పర్సనల్‌ నంబర్‌కు సంబంధించిన అంశం ట్రెండింగ్‌లో నిలిచింది.

విరాట్ కోహ్లీ పుట్టిన రోజు సందర్భంగా గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ట్విటర్‌ వేదికగా ఓ ఎమోషనల్‌ బర్త్‌ డే విషెస్‌ చెప్పింది. జట్టు గెలుపు కోసం రక్తాన్ని, స్వేదాన్ని, కన్నీళ్లను ఇచ్చే గొప్ప వ్యక్తి అని ట్వీట్‌ చేసింది. మా నాయకుడు లెజెండ్‌ అని ప్రశింసిస్తూ.. ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. కెప్టెన్ కోహ్లీ పుట్టినరోజు వేడుక అతని విధ్వంసక బ్యాటింగ్ కంటే ఎక్కువగా జరిగిందని మరో ట్వీట్‌లో పేర్కొంది. 2008 ఐపీఎల్ ప్రారంభం నుంచి లీగ్‌లో ఉన్న విషయాన్ని గుర్తు చేసుకుంది. ఐపీఎల్‌ అధికారక ట్విటర్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసిన వీడియోను షేర్‌ చేసింది.

Related posts