telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

గ్రామ వాలంటీర్ ఉద్యోగాలకు.. మూడు లక్షల మంది ద‌ర‌ఖాస్తు

ap logo

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రామ వాలంటీర్ల నియామాకాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అన్ని పంచాయతీలలో ప్రతి 50 కుటుంబాలకు గ్రామ వాలంటీర్లను ఒక వాలంటీర్‌గా నియమించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ నోటిఫికేషన్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. కేవలం ఆరు రోజుల్లో మూడు లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.

మరోవైపు నిరుద్యోగులు భారీ సంఖ్యలోవెబ్‌సైట్‌ను చూస్తున్నారు. ఇప్పటి వరకూ 11లక్షల మందికి పైగా గ్రామ వాలంటీర్ వెబ్‌సైట్‌ను తిల‌కించారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఆలోచ‌నావిష్క‌ర‌ణ‌కు అన్ని వ‌ర్గాల నుంచి ప్ర‌శంస‌లు వస్తున్నాయి. గ్రామ వాలంటీర్ కోసం అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా http://gramavolunteer.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. ఈనెల 24 నుంచి వచ్చే నెల 5వరకు దరఖాస్తుల స్వీకరిస్తారు. ఇంటర్వ్యూ పద్ధతిలో గ్రామ వాలంటీర్ల ఎంపిక జరగనుంది.

Related posts