BREAKING NEWS:
vijayawada police warning to pavan kalyan fans

పవన్ అభిమానులకు…విజయవాడ పోలీసుల హెచ్చరిక…

59

ఇవాళ్ళ రేపు సామజిక మాధ్యమాలలో వచ్చే వార్తలలో ఏది నిజం ఏది అబద్దం అనేది అసలు తెలియటం లేదు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పటమే ఈ గందరగోళానికి కారణం. అసలు వెసులుబాటు లేకుంటేనే కల్పించుకొని మరీ హడావుడి చేసే మీడియా, రాజకీయ వర్గాలు ‘గందరగోళం లేదా స్పష్టత లేకపోవటం’ వంటి వెసులుబాటు ఉంటె వదులుతారా..వారి ఇష్టానికి వాడేస్తుంటారు…చివరికి అదేమో పెద్దఎత్తున ప్రజలలోకి వెళ్లి ఎక్కడలేని హడావుడిని సృష్టిస్తుంది.

అలాంటిదే జనసేన కార్యకర్తలు, విజయవాడ పోలీసుల మధ్య చోటుచేసుకున్న ఓ సంఘటన. ప్రచారం జరగని దానిని జరిగినట్టు చెప్పటంతో వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలకు తావిచ్చింది. అలా కాకుండా అసలు ఏమి జరిగిందనేది కనుక్కొనే సహనం ఎవరికి లేకుండా పోవటమే ఇటువంటివి త్వరగా ప్రజలలోకి వెళ్లి గందరగోళం సృష్టించింది.

vijayawada police warning to pavan kalyan fans

ఇది ఎంతవరకు వెళ్లిందంటే జనసేన కార్యకర్తలు పోలీసులపై దుష్ప్రచారం మొదలు పెట్టారు, అలాగే పోలీసులు దానికి ఓ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు ఎవరికి తొత్తులుగా పనిచేయరని, ప్రజలకు సేవచేస్తూ, శాంతి భద్రతలు కాపాడుతామని చెప్పారు.

ఇక ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పై అటు బీజేపీ, ఇటు జనసేన, మరో వైపు వైసీపీ ఒకరి తరువాత ఒకరు అన్నట్టు దాడులు చేస్తున్నారు. సామజిక మాద్యమాలు అనేకం అందుబాటులోకి రావటంతో వీరందరూ ఆయా మాధ్యమాలలో ఒకరిపై ఒకరు నిందించుకోవడం, విమర్శించుకోవటం తోనే అవన్నీ నింపేస్తూ ప్రజలకు అసలు ఏది నిజమో తెలియని స్థితిలోకి తెచ్చేస్తున్నారు. ఇలా ఇష్టం వాచినట్టు కాకుండా ప్రజలకు చేరువవటానికి ఈ మాధ్యమాలను ఆయా పార్టీలు వినియోగించుకోవాలని, ఆ మేరకు సరికొత్త నియమనిబంధనలు తీసుకురావాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

vijayawada police warning to pavan kalyan fans

ప్రస్తుతం జరిగిన ఈ గందరగోళానికి పోలీసులు ఒక వివరణగా కొన్ని అసత్యాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో విడుదల చేశారు. అధికారులు ఎప్పుడూ పక్షపాతం లేకుండా ప్రజల కోసమే పనిచేస్తారని ఈ సందర్భంగా తెలిపారు.