తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై బీజేపీ నాయకురాలు విజయశాంతి కామెంట్ చేశారు. ఆయన ఆరోగ్యంగానే ఉండాలని పేర్కొన్నారు. “ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారన్న వైద్యుల ప్రకటనతో సంతోషం కలిగింది. ఆయన నిండు నూరేళ్ళూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ తన ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉందన్న వైద్యుల ప్రకటన ఇచ్చిన భరోసాతో కేసీఆర్ గారు ప్రగతి భవన్‌లో మాయమై మళ్లీ ఫాం హౌస్‌కే పరిమితమవుతారేమో… అన్న అందోళన కలుగుతోంది. ఆయన తన తీరు మార్చుకుని హైదరాబాదులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎన్నికైన ప్రజాప్రతినిధులకు… దయకలిగితే కొంత సమయం ప్రజలకు, ప్రజా సమస్యలకు కేటాయించే కార్యక్రమం చేపడతారని తెలంగాణ సమాజం మరియు అధికార పార్టీ నేతలు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే… అవినీతి కేసులు తేలితే… ఏదో ఒక రోజు చెయ్యి జారిపోయే పరిస్థితులున్న ఆ ముఖ్యమంత్రి పదవిలో ఆ మిగిలిన కాలమైనా కొంచెం పని చేస్తే మంచిది.” అంటూ విజయశాంతి పేర్కొన్నారు.
previous post