telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ చేసిన వ్యాఖ్యల పై విజయసాయిరెడ్డి ఘాటు స్పందన

భయంతోనే, ప్రలోభాలకు లొంగిపోయో లేదా మరే కారణం వల్లో అవతలివారికి లొంగిపోకూడదని రాజకీయాల్లో విజయసాయిరెడ్డికైనా, మరెవరికైనా సరే విశ్వసనీయత ఉండాలంటూ జగన్ వ్యాఖ్యానించారు.

జగన్ చేసిన ఈ వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి తాజాగా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

‘వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి, ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు.

భయం అనేది నాలో ఏ అణువు అణువులోను లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, రాజకీయాలనే వదులుకున్నా’ అని ట్వీట్ చేశారు.

Related posts