వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా, నా రాజీనామాను ధన్‍ఖడ్ ఆమోదించారు.
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా లండన్‍లో ఉన్న జగన్‍తో ఫోన్‍లో మట్లాడా.. అన్నీ వివరించా జగన్‍తోన్ మాట్లాడిన తర్వాతే రాజీనామా చేశా.
ఒకసారి రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత రాజకీయాలు నుంచి తప్పుకున్న తర్వాత రాజకీయాలు మాట్లాడకూడదు, భవిష్యత్‍లో రాజకీయాలపై మాట్లాడను.
పార్టీ సభ్యత్వానికీ రాజీనామా చేస్తా, నేను ఏ రోజూ అబద్దాలు చెప్పలేదు, వెంకటేశ్వరస్వామిని నమ్ముకున్న వ్యక్తిగా నేను అబద్దాలు చెప్పను, మూడు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
వైఎస్ కుటుంబంతో విభేదాలు లేవు, అప్రూవర్‍గా మారాలని ఒత్తిడి వచ్చినా మారలేదు, వెన్నుపోటు రాజకీయాలు నాకు తెలియవు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాకినాడ సీపోర్ట్ కేసు పెట్టారు, నాపై లుకౌట్ నోటీసు ఇచ్చారు..
నన్ను ఏ2గా చేర్చారు కేవీ రావుతో నాకు ఎలాంటి సన్నిహిత సంబంధాలు, వ్యాపార లావాదేవీలు లేవు, విక్రాంత్‍రెడ్డితో నాకున్న పరిచయం చాలా తక్కువ, నా పిల్లలపై ప్రమాణం చేసి చెబుతా.. కాకినాడ సీపోర్టు వ్యవహారం గురించి నాకు తెలియదు.
నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు.. 24 గంటలూ పార్టీ కోసమే పనిచేశా -కాకినాడ సీపోర్టు అంశానికి.. నాకు సంబంధం లేదు.
నాపై ఎలాంటి ఒత్తిడి లేదు.. ఇది నా పూర్తిగా వ్యక్తిగత రాజీనామా, నా రాజీనామాతో కూటమికే లబ్ధి వైసీపీకి నష్టం.
ఎలాంటి పదవులు ఆశించి నేను రాజీనామా చేయలేదు, కేసులు మాఫీ చేస్తారనీ రాజీనామా చేయలేదు, ఎటువంటి కేసునైనా ధైర్యంగా ఎదుర్కొంటా.
నేను ఎవరికీ భయపడను.. నా ఒంట్లో భయమనేతత్వం లేదు గవర్నర్ పదవి కానీ.. బీజేపీలో చేరడంలాంటిది కానీ ఏమీలేదు.
విజయసాయిరెడ్డి విశాఖను దోచేశారనే ఆరోపణల్లో నిజం లేదు నా కుమార్తె, అల్లుడికి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి.
నాకు ఉన్నది బెంగళూరులో ఒక ఇల్లు, విజయవాడలో ఒకటి, విశాఖలో ఒక అపార్ట్ మెంట్ – నాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు.
చెడ్డపేరు తెచ్చుకోవాలనే ఆలోచన నాకు లేదు, నీతి, నిజాయతీగా బతకాలని అనుకుంటున్నా. రాజీనామా చేయొద్దని జగన్ చెప్పారు పార్టీ అండగా ఉంటుందని జగన్ చెప్పారు.
ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి న్యాయం చేయలేనని చెప్పా, రాజీనామాపై నా నిర్ణయం మారదని చెప్పా, అబద్దాలు చెప్పకపొతే రాజకీయాల్లో రాణించడం కష్టం.. అబద్ధాలు చెప్పలేకే రాజీనామా నిర్ణయం.