telugu navyamedia
సినిమా వార్తలు

“లక్ష్మీస్ ఎన్టీఆర్” : ఈ ఘన విజయం వాళ్లకు ఓ గొప్ప చెంపదెబ్బ

Lakshmi's-NTR

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమాకు ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా హైప్ వచ్చేసింది. తాజాగా ఈ చిత్రం నుంచి మరో పాట ప్రోమో విడుదలైంది. ఈరోజు ఉదయం “విజయం విజయం ఘన విజయం… ” అంటూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలాపించిన పాటను విడుదల చేశారు. ఈ పాట 1994 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి, ఎన్టీఆర్ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించే క్రమంలో వస్తుంది. ఇదే పాటలో “నీలాంటి వ్యక్తిని పట్టుకుని ఎన్ని నిందలు మోపారు. వాళ్లందరికీ ఈ ఘన విజయం ఓ గొప్ప చెంపదెబ్బ” అంటూ ఎన్టీఆర్ డైలాగ్ కూడా చెప్పారు. ఇంకా సెన్సార్ కార్యక్రమాలు పూర్తికాకపోవడంతో సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాడు వర్మ. ఈ నెల 22న సినిమాను విడుదల చేయడం సాధ్యం కాదని, 29న విడుదల చేయాలని నిర్ణయించాడు. బుధవారం ఈ సినిమా సెన్సార్ స్క్రీనింగ్ జరిగే అవకాశం ఉంది.

Related posts